Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: శ్రీవారి లడ్డు ప్రసాదం పై టీటీడీ కీలక నిర్ణయం - వారి పై చర్యలకు సిద్దం..!!

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి తీపికబురు చెప్పింది. రూ.4.15 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డు కౌంటర్లు నిర్మాణం చేపట్టాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. అదే విధంగా వసతి గదుల ఆదునీకరణకు నిర్ణయించారు. సెంట్రల్ రికార్డు రూమ్ నిర్మాణంకు పాలక మండలి ఆమోదం తెలిపింది. శ్రీవాణి ట్రస్టుపై అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

పాలక మండలి సమావేశం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసారు. రూ.4.15 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డు కౌంటర్లు నిర్మాణం చేపట్టాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో శ్రీవారి భక్తులు లడ్డూల కోసం ఎక్కువ సమయం క్యూలైన్లలో వేచి ఉండే పరిస్థితి తప్పే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు భక్తులు లడ్డూ కౌంటర్ల ఏర్పాటు పైన ఈవోను కోరారు. బ్యాంకర్లతోనూ చర్చించిన ఈవో అదనపు కౌంటర్ల పైన చర్చించారు. ఇప్పుడు బోర్డు సమావేశంలో అదనపు కౌంటర్ల ఏర్పాటుకు నిర్ణయించారు. 2.35 కోట్లతో హెచ్ వీసీ ప్రాంతంలో వున్న 144 గదులు ఆధునికరణకు పాలక మండలి ఆమోదం తెలిపింది.

 TTD:

శ్రీవాణి ట్రస్టుపై అసత్య ఆరోపణలు
తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్‌‌‌కు సంబంధించిన వస్తున్న ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి స్పందించారు. నిధులను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారంటూ దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని.. ఈ ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆలయ నిర్మాణాలతో పాటు హిందూ ధార్మిక ప్రచారం కోసం శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించామని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో 2445 ఆలయాలని నిర్మాణం చేశామన్నారు. 250 పురాతన ఆలయాలకీ మరమ్మత్తులు చేశామని తెలిపారు. త్వరలోనే శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని వెల్లడించారు. దాత ఇచ్చిన ప్రతి రూపాయికి రసీదు ఇస్తున్నామని అన్నారు. శ్రీవాణి ట్రస్టుపై అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని.. కేసులు నమోదు చేసి..కఠిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

 TTD:

పాలక మండలి నిర్ణయాలు
పాలక మండలి సమావేశంలో మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. 1.88 కోట్లతో జీఎంసీ,ఎస్ఎంసి ఉప విచారణ కార్యాలయాలు ఆధునికరించనున్నారు. మూడేళ్ళ పాటు వేస్ట్ మేనేజ్ మెంట్ నిర్వహణ టెండర్ ని ఎల్టీఈ సంస్థకీ 40.50 కోట్లకీ అప్పగించాలని నిర్ణయించారు. 20.50 కోట్లతో సేవాసదన్, వకుళమాతతో పాటు పలు గదుల నిర్వహణని ప్రైవేట్ సంస్థకీ కేటాయింపుకు ఆమోదం తెలిపారు. 4కోట్ల రూపాయలతో ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి ఆలయంలో అన్నదాన భవనం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 6.65 కోట్లతో తిరుచానూరు పుష్కరిణి అభివృద్ధి..5.61 కోట్లతో రామానుజ సర్కిల్ నుంచి రోడ్డు నిర్మాణం...గుజరాత్ లోని గాంధీనగర్,చత్తిస్ గడ్ రాష్ట్రం రాయపూర్ లో ఆలయ నిర్మాణం చేయాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+