శ్రీవారి దివ్య -సర్వ దర్శనం టోకెన్ల జారీలో మార్పు : టీటీడీ కీలక ప్రకటన..!!
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు టోకెన్ల జారీపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.ఇప్పుడు టోకెన్ల జారీ కేంద్రాన్ని మార్పు చేసింది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇదే సమయంలో టోకెన్లు పొందన భక్తులకు పలు సూచనలు చేసింది. ఇక, వచ్చే వారం నుంచి తిరుమలలో రద్దీ ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో టీటీడీ కొన్ని నిర్ణయాల అమలు దిశగా నిర్ణయం తీసుకుంది.
దివ్య దర్శనం టోకెన్ల కేంద్ర మార్పు:తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం 2083వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించరని టీటీడీ అధికారులు వెల్లడించారు. భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.

సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు:వాహనాల్లో తిరుమలకు చేరుకోకునే భక్తులకు తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. తిరుమలలో క్రమేణా పెరుగుతున్న రద్దీ కారణంగా సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. అందులో భాగంగా విఐపి బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ.300 దర్శన టికెట్లను టిటిడి బోర్డు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు.ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు వేసారు.
వేసవి రద్దీ వేళ కీలక నిర్ణయాలు:ఇక..వసతి విషయంలోనూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తిరుమలలో దాదాపు 7400 గదులు, 4 పిఏసిలు ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. దాదాపు 85 శాతం గదులు సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నామని ఈవో వెల్లడించారు. తిరుమలలో ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకున్న వారు స్వయంగా వచ్చి ఏఆర్‌పి కౌంటర్‌లో స్కానింగ్ చేసుకోవాలి. వారికి గది కేటాయించినట్టుగా మెసేజ్ వచ్చిన తర్వాత సంబంధిత సబ్ ఆఫీసుకు వెళ్లి గదులు పొందాలని సూచిస్తున్నారు. ఇతరులు ఎవరు వచ్చినా గదులు పొందలేరని చెప్పుకొచ్చారు. నిర్ణీత సమయం(రెండు గంటల) లోపు సంబంధిత భక్తుడు గది తీసుకోకపోతే కాలపరిమితి ముగుస్తుందని స్పష్టం చేస్తున్నారు. భక్తులకు కొరత లేకుండా తగినన్ని లడ్డూలు నిల్వ చేసేందుకు చర్యలు తీకున్నామని అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications