తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TTD: శ్రీవారి కాలినడక భక్తుల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి షెల్టర్స్ నిర్మాణం, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి !

తమిళనాడు రాజధాని చెన్నై సిటీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నడచివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతి 20 నుంచి 30 కిలోమీటర్లు దూరానికి వసతి షెల్టర్లు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరుపతి: తమిళనాడు రాజధాని చెన్నై సిటీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నడచివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతి 20 నుంచి 30 కిలోమీటర్లు దూరానికి వసతి షెల్టర్లు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.చెన్నై టీ నగర్ లోని టీటీడీ సమాచార కేంద్రం లో స్థానిక సలహామండలి చైర్మన్ గాశేఖర్ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ శేఖర్ రెడ్డి తిరుమల శ్రీవారి పరమ భక్తుడు అని చెప్పారు. హిందూ ధర్మ ప్రచారం కోసం ఆయన ఇతోధిక సహాయం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వచ్చే ఏడాది పెరటాసి మాసం ప్రారంభమయ్యే లోపు కాలినడకన వచ్చే భక్తుల సదుపాయం కోసం షెల్టర్లు నిర్మాణం పూర్తి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

TTD

చెన్నై లో నిర్మిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం ఏడాదిలోపు పూర్తి చేసి కుంభాభిషేకం నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల తరహాలో చెన్నై నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఓఎంఆర్, ఈసిఆర్ ప్రాంతాల్లో భూమి ఇవ్వడానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ ఇంజనీర్లు ఈ రెండు భూములను త్వరలో పరిశీలించి, స్వామివారి ఆలయ నిర్మాణానికి ఏ భూమి అనుకూలమో నిర్ణయిస్తారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

అనంతరం త్వరలోనే ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తామని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. చెన్నై నగరంలోని రాయపేట లో ఉన్న రెండు ఎకరాల భూమిలో మధ్య, దిగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈనెల 11వ తేదీన ఎస్ వి బి సి హిందీ, కన్నడ ఛానళ్ళను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, బసవ రాజ్ బొమ్మయ్ ప్రారంభిస్తారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అలిపిరి వద్ద శేఖర్ రెడ్డి నిర్మించిన గో మందిరాన్ని అదే రోజు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకే తిరుమల శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

చెన్నైలోని టీటీడీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా అలిపిరిలో గోమందిరం నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక్కడ గో తులాభారం కూడా ఏర్పాటు చేసినట్లు శేఖర్ రెడ్డి చెప్పారు. స్వామి వారు ఇది తనకు ఇచ్చిన భాగ్యమని శెఖర్ రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Chennai: TTD Chairman YV Subba Reddy said in Chennai TTD is contemplating to build rest shelters for every 20-30 kms to facilitate devotees coming from Tamil Nadu on foot to Tirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X