తిరుమలలో విశేష ఉత్సవాలు, ఆరోజుల్లో కొండ మీద శ్రీవారి భక్తులకు పండగ !

తిరుమల/తిరుపతి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తుల రద్దీ వేసవి సెలవుల్లో రోజురోజుకు పెరిగిపోతున్నది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిద రాష్ట్రాలకు చెందిన భక్తులు తిరుమల చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ అధికారులు, సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

సోమవారం శ్రీవారి భక్తులతో తిరుమల కిటకిటలాడింది. మే 29వ తేదీ సోమవారం అర్దరాత్రి వరకు 78, 126 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 37, 597 మంది భక్తులు శ్రీవారికి తలనీనాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం శ్రీవారికి రూ. 3 కోట్ల 74 లక్షలు హుండీ కానుకుల రూపంలో వచ్చాయని టీటీడీ అధికారులు మంగళవారం ఉదయం తెలిపారు.

TTD officials are making all the arrangements for special festivals in Tirumala in the month of June.

తిరమలలో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో క్యూకాంప్లెక్స్ లు నిండిపోయి క్యూలైన్లు తిరుమలలోని టీబీసీ కాటేజ్ వరకు వచ్చాయి. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఉన్న భక్తులకు వారికి కేటాయించిన సమయంలోనే స్వామి వారి దర్శనం కలుగుతోంది. సర్వదర్శనం టోకన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.

క్యూలైన్లలో ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఓపికగా ఉండాలని, ప్రతి ఒక్కరిని స్వామివారి దర్శనం అవుతుందని, అంత వరకు సహనంతో ఉండాలని టీటీడీ అధికారులు మనవి చేశారు. ఉదయం, మద్యాహ్నం, రాత్రి క్యూకాంప్లెక్స్ లో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.

TTD officials are making all the arrangements for special festivals in Tirumala in the month of June.

వేసవి సెలవులు పూర్తి కావస్తున్న సమయంలో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు వేల సంఖ్యలో తిరుమల చేరుకుంటున్నారు. వేసవి సెలవులు పూర్తి అయ్యే వరకు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుందని టీటీడీ అధికారులు అంటున్నారు. ఇక జూన్ నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు అవుతారని టీటీడీ అధికారులు అంటున్నారు.

* తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు
.

* జూన్ 2వ తేదీన నమ్మాళ్వార్ శాత్తుమొర.

* జూన్ 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం.

* జూన్ 4వ తేదీన ఏరువాక పూర్ణిమ.

* జూన్ 14వ తేదీన మతత్రయ ఏకాదశి.

* జూన్ 20వ తేదీన పెరియాళ్వార్ ఉత్సవారంభం.

* జూన్ 29వ తేదీన శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.

ఈ విశేష ఉత్సవాల సందర్బంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో తిరుమలలో ని బస్ స్టాండ్ లు, ఇతర ప్రాంతాలు, పార్క్ ల సమీపంలో ప్రత్యేక చలివేండ్రాలు ఏర్పాటు చేసిన టీటీడీ అధికారులు 24 గంటలు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలోని బస్ స్టాండ్ లు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో భక్తులకు ప్రసాదాలు పంపిణి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+