TTD: శ్రీవారి దర్శనం, వసతి కోటా పై టీటీడీ కీలక నిర్ణయం..!!

శ్రీవారి భక్తులకు దర్శనం..సేవలు..వసతి పైన టీటీడీ కీలక ప్రకటన చేసింది. కొత్త పాలక మండలి ఏర్పాటు తరువాత తిరుమలలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దర్శనం కోసం వేచి ఉండే సమయం తగ్గించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి మాసంలో శ్రీవారి ఆర్జిత సేవలతో పాటుగా .. దర్శన కోటాను టీటీడీ విడుదల చేసింది. అదే విధంగా శ్రీవాణి టికెట్ల విషయంలోనూ టీటీడీ తాజా నిర్ణయం వెల్లడించింది.

సేవా టికెట్లు విడుదల
తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా 2025 ఫిబ్రవరి నెల కోటాను గురువారం టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడంచారు. అదే విధంగా ఫిబ్రవరి నెల‌కు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను నవంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

TTD Releases February moth Arjitha seva and Darshnam online quota increases srivani tokens

దర్శనం .. వసతి
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల ఆన్ లైన్ కోటాను నవంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను నవంబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబరు 25న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచుతారు. తిరుమల, తిరుపతిల‌లో ఫిబ్రవరి నెల గదుల కోటాను నవంబరు 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

శ్రీవాణి టోకెన్ల పెంపు
ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ అధికారులు సూచించారు. ఇక.. రేణిగుంట విమానాశ్రయంలో ప్రతిరోజూ జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ 100 నుండి 200 కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బోర్డింగ్ పాస్‌ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తారు.అలాగే తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్ లో ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుండి 800 కు తగ్గించారు. ఇక, మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు. ఈ విధానం రేపటి నుండి అమలులోకి రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+