శ్రీవారి డిపాజిట్లు - బంగారం విలువ ఎంతో తెలుసా : ఇవీ లెక్కలు..!!

శ్రీవారి ఆస్తులకు సంబంధించి టీటీడీ శ్వేత పత్రం విడుదల చేసింది. శ్రీవారి ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో జరుగుతున్న దుష్ఫ్రచారాన్ని నమ్మవద్ది టీటీడీ కోరింది. టీటీడీ బోర్డు ఆమోదించిన విధంగానే బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు వెల్లడించింది. శ్రీవారికి బ్యాంకుల్లో మొత్తంగా రూ 15,938 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది. అదే విధంగా 10,258.37 బంగారం ఉన్నట్లు వివరించింది. 24 జాతీయ బ్యాంకుల్లో నగదు నిల్వ చేసినట్లు టీటీడీ ప్రకటించింది. గత మూడేళ్ల కాలంలో శ్రీవారి నగదు..డిపాజిట్లు బాగా పెరిగాయని టీడీపీ వెల్లడిచింది.

బ్యాంకు డిపాజిట్లు 2019, జూన్ 30 నాటికి 13025.09 కోట్లు ఉండగా, సెప్టెంబర్ 30, 2022 నాటికి అవి 15938.68 కోట్లకు చేరాయి. అదే విధంగా బంగారం 2019 జూన్ 30 నాటికి 7339.74 కిలోలు ఉండగాసెప్టెంబర్ 30, 2022 కి ఆ మొత్తం 10,258.37 కిలోలకు చేరింది. ఆప్పన్న హృదయ స్కీంకీ లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన భక్తుడికి 6విఐపి బ్రేక్ దర్శనం టిక్కెట్లను జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. వికలాంగులు,వయోవృద్ధులు దర్శనానికి వెళ్ళే సమయంలో వారికీ సహాయంగా శ్రీవారి సేవకుల ద్వారా సేవలు అందిస్తామని టీటీడీ వెల్లడించింది.

TTD Releases white paper on Cash and Gold deposits details

అక్టోబర్ మాసంలో 22.74 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. హుండీ ద్వారా 122కోట్ల 23లక్షలు ఆదాయం లభించింది. కోటి 8లక్షల లడ్డులను భక్తులకు విక్రయించినట్లు తెలిపారు. 60లక్షల 91వేల మంది భక్తులు అన్నదానంలో అన్నప్రసాదాని స్వీకరించారని.. 10లక్షల 25వేల మంది భక్తులు శ్రీవారికీ తలనీలాలను సమర్పించారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+