TTD: అట్టహాసంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలు: విశేషాలివే!!
కలియుగ ప్రత్యక్ష దైవం, సప్తగిరులపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
బ్రహ్మోత్సవాలకు ముందు ఫిబ్రవరి 22న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంవ నిర్వహిస్తారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇది బ్రహ్మోత్సవాలకు ముందు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కొనసాగుతుంది

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలలో భాగంగా ఉదయం ఎనిమిది గంటల నుండి 9 గంటల వరకు రాత్రి 7 గంటల నుండి ఎనిమిది గంటల వరకు వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు వివరాల్లోకి వెళితే ఫిబ్రవరి 29వ తేదీ ఉదయం ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి పెద్ద శేష వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు.
మార్చి 1వ తేదీన ఉదయం చిన్న శేష వాహనం మీద, రాత్రి హంస వాహనం మీద భక్తులకు స్వామి దర్శనం ఇస్తాడు. మార్చి రెండో తేదీ ఉదయం సింహ వాహనం మీద, రాత్రి ముత్యాల పందిరి వాహనం మీద స్వామివారు ఊరేగుతారు. మార్చి మూడో తేదీ ఉదయం కల్పవృక్షవాహనం మీద, రాత్రి సర్వ భూపాల వాహనం మీద స్వామి విహరిస్తారు.
మార్చి 4వ తేదీ పల్లకి ఉత్సవం, రాత్రి గరుడ వాహనంపై స్వామి ఊరేగుతారు. మార్చి 5వ తేదీన ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజ వాహనం మీద స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. 6 తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి కరుణిస్తాడు.
ఏడవ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనంపై స్వామి ఊరేగుతారు. 8వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు. దీనికి సంబంధించి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.












Click it and Unblock the Notifications