TTD: తిరుమలలో బసచేసే భక్తులు సంతృప్తిగా ఉండాలి, టోల్ ఫ్రీనెంబర్ తో పరిష్కారం, స్మార్ట్ కార్డులు, ఈవో !

తిరుమల/ తిరుపతి: తిరుమ‌ల‌లో భక్తుల బ‌స‌కు సంబంధించిన రిసెప్షన్(ఎఫ్ఎంఎస్) టోల్ ఫ్రీ నంబ‌రు : 9966812345కు వ‌స్తున్న సూచ‌న‌లు, స‌ల‌హాలు, ఫిర్యాదుల‌ను స‌త్వ‌రం ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలని టీటీడీ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌ రెడ్డి టీటీడీ అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం టీటీడీ సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో జవహర్ రెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్బంగా టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తిరుమలకు వస్తున్న శ్రీవారి భక్తులు

సంతృప్తితో కొండ దిగి వెళ్లేలా అధికారులు, సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పించాలని, అదే మనకు ఆ ఏడుకొండల స్వామి కల్పించిన మహా భాగ్యం అని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులకు చెప్పారు. టీటీడీ అధికారులు, ఉద్యోగులకు స్మార్ట్ కార్డులు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు.

టాటా, టెక్ మహింద్రా సంస్థల సహకారం

టాటా, టెక్ మహింద్రా సంస్థల సహకారం

అధికారుల సమావేశంలో టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ గ‌దులు పొందే యాత్రికులు పూర్తి సంతృప్తితో తిరిగి వెళ్లేలా సౌక‌ర్యాలు క‌ల్పించాల‌న్నారు. టెక్ మహింద్రా, టాటా సంస్థ‌ల స‌హ‌కారంతో ఆధునీక‌రించనున్న తిరుమ‌లలోని ఎస్వీ మ్యూజియం ప‌నుల‌ను ఈవో జవహర్ రెడ్డి స‌మీక్షించారు. అదేవిధంగా తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద‌గ‌ల మ్యూజియం అభివృద్ధిపై చ‌ర్చించారు.

 టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలి

టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలి

టీటీడీ ఉద్యోగుల‌కు ఆరోగ్య సంర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, పూర్తి ఆరోగ్య‌వంతులుగా ఉన్న‌ప్పుడే చ‌క్క‌గా విధులు నిర్వ‌హించి భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించ‌గ‌లుగుతార‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. టీటీడీ ఉద్యోగుల‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాల‌ని, ఇందుకోసం వైద్య విభాగం ప్ర‌త్యేకంగా కార్యాచర‌ణ రూపొందించాల‌ని టీటీడీ ఈవో కెస్. జవహర్ రెడ్డి పంబంధిత అధికారులకు ఆదేశించారు.

 వారం రోజుల్లో పూర్తి అవ్వాలి

వారం రోజుల్లో పూర్తి అవ్వాలి

టీటీడీ ఉద్యోగులు, కుటుంబ స‌భ్యులు, పెన్ష‌న‌ర్ల స్మార్ట్ కార్డుల త‌యారీకి సంబంధించి వారం రోజుల్లోపు అంద‌రి నుంచి వివ‌రాలు తెప్పించుకోవాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. టీటీడీ ఉద్యోగులు రిటైరైన రోజే అన్ని ప్రయోజనాలు అందించేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. తిరుమ‌ల శేషాచ‌లం అడ‌వుల్లో విస్త‌రించి ఉన్న అకేషియా చెట్ల‌ను తొల‌గించి ఇత‌ర మొక్క‌లు నాటే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు.

ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్

ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్

45 సంవ‌త్స‌రాలు దాటిన టీటీడీ ఉద్యోగుల్లో వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌ని, ఇక 18 నుండి 45 ఏళ్ల లోపు ఉన్న ఉద్యోగుల‌కు వ్యాక్సిన్లు వేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని ప‌ల‌మనేరులోని ఎస్వీ గోశాల చుట్టూ బ‌యోఫెన్సింగ్ ఏర్పాటు చేయాల‌ని, అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో కంద‌కాలు తవ్వేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి కోరారు.

 సరికొత్తగా సప్తగిరి మాసపత్రిక

సరికొత్తగా సప్తగిరి మాసపత్రిక

అక్టోబ‌రు నుంచి స‌ప్త‌గిరి మాస‌ప్ర‌తిక‌ను స‌రికొత్త శీర్షిక‌ల‌తో ఆక‌ర్ష‌ణీయంగా తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. టీటీడీలోని వివిధ ప్రాజెక్టుల స‌మ‌న్వ‌య స‌హ‌కారంతో నిర్వ‌హించ‌నున్న ప‌లు ఆధ్యాత్మిక‌, భ‌క్తి కార్య‌క్ర‌మాల్లో శ్రీ‌వారి సేవ‌కుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సూచించారు.

తిరుమల, తిరుపతి పారిశుద్ద కార్మికులపై ప్రత్యేక శ్రద్ద

తిరుమల, తిరుపతి పారిశుద్ద కార్మికులపై ప్రత్యేక శ్రద్ద


తిరుమ‌ల‌, తిరుప‌తిలో ప‌నిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి రేడియం జాకెట్లు అందించాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నం ముఖ‌ద్వారం, ఇత‌ర ప‌రిస‌రాలను ఆధ్యాత్మిక‌త ఉట్టిప‌డేలా రూపొందించాల‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి సూచించారు. అనంత‌రం స్థానికాల‌యాల్లో అమ‌ల‌వుతున్న ద‌ర్శ‌న విధానాలు, సేవ‌ల గురించి టీటీడీ ఈవో జవహర్ రెడ్డి స‌మీక్షించారు.ఈ స‌మావేశంలో టీటీడీ అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, టీటీడీ జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, టీటీడీ సివిఎస్వో గోపినాథ్ జెట్టి, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+