TTD: వైకుంఠ ద్వారదర్శనం ఎస్ఈడీ, వసతి టికెట్ల అప్డేట్ - ఇలా సులభంగా ..!!
Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుకని తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబరు 10న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ సారి వైకుంఠ ద్వార దర్శనం సమయంలో భక్తులకు వసతికి సంబంధించి కోటాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు టీటీడీ కీలక సూచనలు చేసింది.
దర్శనం - వసతి టోకెన్లు:ఈ నెల 10వ తేదీ ఉదయం 2.25 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. 20 వేల శ్రీవాణి దర్శనం టికెట్లను రోజుకు రెండు వేల చొప్పున పది రోజుల పాటు మధ్నాహ్నం మూడు గంటలకు గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి 2023 డిసెంబర్ 23, 2024 జనవరి 1 వరకు జరగనుంది. ఈ సారి ఈ పర్వదినం సమయంలో తిరమలకు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఆన్ లైన్ తో పాటుగా ఆఫ్ లైన్ విధానంలోనూ దర్శన టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. తిరుపతిలో కరెంట్ బుకింగ్ విధానంలో జారీ చేస్తారు. తిరుపతి ట్రస్ట్ కరెంట్ బుకింగ్ కోటాను అధికారికంగా వెల్లడించనున్నారు.

ఆప్ లైన్ లో టికెట్లు:వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి వేంకటేశ్వరుని ఆలయంలో 2024 డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు స్వర్గద్వారాలు తెరిచి ఉంచనున్నారు. వైకుంఠ వాసంలోకి ప్రవేశించేందుకు భక్తులకు ఉచిత దర్శనం టోకెన్ అందించేందుకు తిరుపతిలో ప్రస్తుతం ఉన్న కౌంటర్లకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు 50,000 మరియు 10 రోజుల పాటు 5 లక్షల ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. కౌంటర్లకు వచ్చి తమ ఆధార్ కార్డులను సమర్పించి పొందవచ్చని తెలిపారు. ఇక, తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 12వ తేదీన 'దీపావళి ఆస్థానాన్ని' టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
దీపావళి ఆస్థానం:దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. దీపావళి ఆస్థానం కారణంగా నవంబర్ 12న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications