వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ దాఖలు ,తిరుపతి ఉపఎన్నిక లో గెలుపు లాంఛనమే : వైసీపీ మంత్రులు

తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల వేడి నామినేషన్లు దాఖలు తో పీక్స్ కు చేరుకుంటుంది.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. టీటీడీ చైర్మన్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా ఇన్చార్జి వై.వి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ గురుమూర్తి సుముహూర్తాన నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.

నెల్లూరు కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు. కోవిడ్ నిబంధనల నేపధ్యంలో కరోనా జాగ్రత్తలతో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు

వైసీపీ అభ్యర్థిగా డా. గురుమూర్తి నామినేషన్ .. హాజరైన మంత్రులు , కీలక నేతలు

వైసీపీ అభ్యర్థిగా డా. గురుమూర్తి నామినేషన్ .. హాజరైన మంత్రులు , కీలక నేతలు

వైసీపీ అభ్యర్థిగా డా. గురుమూర్తి నామినేషన్ దాఖలుకు 9.30 గంటలకు చెయ్యాల్సి ఉంది . అయితే నామినేషన్ దాఖలుకు ఆలస్యం అవుతున్న నేపధ్యంలో మంచి ముహూర్తం చూసుకుని వైసీపీ కీలక నాయకుల సమక్షంలో చేసే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి కన్నబాబు , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు . నెల్లూరు వైసీపీ కార్యాలయానికి చేరుకుని అక్కడ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పూలమాలవేసి నివాళులర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తో పాటుగా మంత్రులు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు వైసిపి నాయకులు హాజరయ్యారు.

నామినేషన్ దాఖలు చేసిన గురుమూర్తి

నామినేషన్ దాఖలు చేసిన గురుమూర్తి

వైఎస్ఆర్ విగ్రహానికి , డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్ కు వెళ్లి గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఇంతకుముందు ఎన్నికలలానే ఫ్యాన్ హవా కొనసాగుతుందని వైసీపీ మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు . సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తుంది అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమాతో ఉన్నారు.

తిరుపతిలో ఉప ఎన్నికలో వైసీపీ విజయం లాంఛనప్రాయమే అంటున్న మంత్రులు

తిరుపతిలో ఉప ఎన్నికలో వైసీపీ విజయం లాంఛనప్రాయమే అంటున్న మంత్రులు

తిరుపతిలో ఉప ఎన్నికలో వైసీపీ విజయం లాంఛనప్రాయమేనని ఆయన తేల్చి చెబుతున్నారు. తిరుపతిలో వైసీపీని ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు పెద్దఎత్తున వ్యూహాలను రచిస్తూ ఉంటే, వైసీపీ మంత్రులు సైతం ప్రతిపక్ష పార్టీలను దీటుగా ఎదుర్కొంటామని ఈ ఎన్నికల్లో విజయం తమదేనని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ అభ్యర్తినిగా పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు . ఇక ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి సైతం ఎన్నికల సమరంలోకి ఈ రోజు నామినేషన్ దాఖలు చేసి అడుగు పెడుతున్నారు .

వై సి పి మంత్రులు, ముఖ్య నేతల సమక్షంలో కలెక్టరేట్ లో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేసిన గురుమూర్తి , ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నామినేషన్ వేశానని తెలిపారు. ప్రజల నుండి తనకు ఆశీస్సులు ఉండాలని కోరుతున్నా అని డాక్టర్ గురుమూర్తి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+