మోహన్ బాబుతో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ భేటీ- మంచు విష్ణు, వైవీ సుబ్బారెడ్డి

తిరుపతి: ప్రముఖ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోహన్ బాబు నిర్మించిన షిర్డీ సాయినాథుని ఆలయానికి ప్రముఖల తాకిడి పెరిగింది. గత ఏడాది శ్రావణ మాసంలో ఈ ఆలయాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారాయన. మూడు రోజుల పాటు యజ్ఞ యాగాదులను నిర్వహించారు. ఆగస్టు 11వ తేదీన సాయినాథుడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ ఆలయానికి వీఐపీల రద్దీ భారీగా ఉంటోంది.

తిరుపతి సమీపంలోని రంగంపేట క్రాస్ వద్ద మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యానికేతన్, యూనివర్శిటీ పరిసరాల్లోనే ఈ ఆలయం నిర్మితమైంది. ద‌క్షిణాది రాష్ట్రాల్లోనే అతి పెద్ద‌ సాయిబాబా ఆలయం ఇది. కొత్త సంవత్సరం సందర్భంగా వందలాదిమంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించారు. సాయినాథునికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతికి వచ్చే ప్రతిభక్తుడు కూడా ఈ ఆలయాన్ని సందర్శించేలా చేయాలనే సత్సంకల్పంతో మోహన్ బాబు- శ్రీవిద్యానికేతన్ పరిసరాల్లోనే దీన్ని నిర్మించారు.

YSRCPs Hindupur MP Gorantla Madhav meets the Party leader and actor Mohan Babu and family

తాజాగా శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్- ఈ ఆలయాన్ని సందర్శించారు. పౌర్ణమి నాడు అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మోహన్ బాబు కుమారుడు, ప్రముఖ నటుడు మంచు విష్ణు, ఆయన భార్య వెరోనికా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాయినాథుని ఆలయాన్ని గోరంట్ల మాధవ్ సందర్శించడం ఇదే తొలిసారి.

తొలిసారిగా ఆలయానికి వచ్చిన గోరంట్ల మాధవ్ ను మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గోరంట్ల మాధవ్- మోహన్ బాబుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల గురించి మాట్లాడినట్లు సమాచారం. అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా రాజకీయాల గురించి కూడా మోహన్ బాబు ఆరా తీసినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+