Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul murder case:12 మంది కాదు 13 మంది.. రాహుల్ హత్య ఇలా: సీపీ

బెజవాడ బిజినెస్ మేన్ రాహుల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. నగదు లావాదేవీలు అని, కంపెనీ కొనుగోలు అని రకరకాల అంశాలు తెరపైకి వస్తోన్నాయి. అయితే రాహుల్ మరణానికి గల మరో కారణం తెలిసింది. అతనిని ఎలా చంపారనే విషయంపై క్లారిటీ వచ్చింది. రాహుల్ హత్య కేసులో 12 మంది పాత్ర ఉందని నిన్న తెలిసింది. కానీ అదీ 13 మంది అని విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు.

13 మంది..

13 మంది..

పారిశ్రామిక వేత్త రాహుల్‌ను 13 మంది హత్య చేశారని సీపీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం రాహుల్ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. కాల్ డేటా ఆధారంగా హత్యలో ఎవరు ఉన్నారో తెలుసుకున్నామని సీపీ పేర్కొన్నారు. వ్యాపారాల్లో కోరాడ విజయ్‌కుమార్‌తో రాహుల్‌కు గొడవలు ఉన్నాయని తెలిపారు. గాయత్రి అనే మహిళతో కలిసి కోరాడ చిట్స్ వ్యాపారం చేశాడని చెప్పారు. కోగంటి సత్యం ద్వారా తన వాటా కోసం కోరాడ రాహుల్‌పై ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. అలాగే గాయత్రి కుమార్తెకు మెడికల్ సీటు ఇస్తానని రాహుల్ 6 కోట్లు తీసుకున్నాడని, 18వ తేదీ రాత్రి 7.30 గంటలకు వివాదం సెటిల్ చేసుకుందాం అని పిలిచి హత్య చేశారని, మొత్తం 13 మంది నిందితులు ఉన్నారని వీరిలో ఏడుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. హత్యలో పాల్గొన్న ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉందని శ్రీనివాసులు చెప్పారు.

ఇద్దరు కలిసి

ఇద్దరు కలిసి

రాహుల్‌ హత్య కేసులో సూత్రధారి కోగంటి సత్యం, పాత్రధారి కోరాడ విజయ కుమార్‌ అని పోలీసులు తేల్చారు. హత్యకు ముందు రాహుల్‌ను దారుణంగా కొట్టారని.. తలపై అనేకసార్లు కొట్టడంతో అతని మెదడు నరాలు కూడా చిట్లినట్టు గుర్తించారు. కారులోనే తాడుతో ఉరేసి చంపి... ఆ స్థానంలో మరొ తాడుని ఉంచినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. పోలీసులకు సాక్ష్యాధారాలు దొరకకుండా నిందితులు పక్కా ప్లాన్‌ ప్రకారం వ్యవహరించినట్టు తెలుస్తోంది. రాహుల్‌ ఒక ఫోన్‌ మాయం చేయడం.. బినామీ పేర్లతో కొత్త ఫోన్లు, కొత్త సిమ్‌ కార్డులు తీసుకొని వినియోగించినట్టు ఇందులో భాగమనేనని పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు రెండు చోట్ల సెటిల్ మెంట్‌కి ప్రయత్నించారు. అక్కడ మాట వినకపోవడంతో రాహుల్‌ని తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. రాహుల్ హత్యలో మొత్తం 12 మంది పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు..

30 శాతం వాటా..

30 శాతం వాటా..

ఫ్యాక్టరీని కోగంటి సత్యానికి అమ్మేసి తన 30 శాతం వాటా డబ్బులు ఇవ్వాలని కోరాడ విజయ్ ఒత్తిడి తీసుకొచ్చాడని పోలీసులు గుర్తించారు. కోగంటి సమక్షంలో బలవంతంగా కంపెనీ షేర్లు మార్పిస్తూ పేపర్లపై సంతకాలు పెట్టించి.. అక్కడే రాహుల్‌ని మరోసారి దారుణంగా కొట్టినట్టు తెలుస్తోంది. రాహుల్‌ని చంపేయాలని కోగంటి, కోరాడ తమ అనుచరులకు ఆదేశించారని.. వారి ఆదేశాలతో కారులోనే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలక విషయాలు పొందుపర్చారు. వాటా అమ్మే విషయంలో రాహుల్‌, విజయ్‌కుమార్‌ మధ్య తలెత్తిన వివాదాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు కోగంటి సత్యం ప్రయత్నించినట్టు పేర్కొన్నారు. చౌకగా కంపెనీని కొట్టేయాలని కోగంటి ప్రణాళిక రచించినట్టు తేల్చారు. నామమాత్రపు ధరకు కంపెనీని అమ్మేందుకు రాహుల్‌ అంగీకరించనందునే.. హత్యకు కుట్రపన్నినట్టు పోలీసులు నిర్ధారించారు.

రాహుల్ వాటా ఇదీ

రాహుల్ వాటా ఇదీ


జిక్సిన్‌ కంపెనీలో రాహుల్‌కు 40 శాతం వాటా ఉండగా.. విజయ్‌కుమార్‌కు 30 శాతం వాటా ఉన్నాయి. బొబ్బా స్వామి కిరణ్‌, రాహుల్‌ చౌదరికి కలిపి మరో 30 శాతం వాటా ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో కోరాడ విజయ్‌కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు ఖర్చు చేసిన విజయ్‌కుమార్‌ను.. అప్పులు ఇచ్చిన వారు వేధించడం మొదలు పెట్టారు. దీంతో జిక్సిన్‌ కంపెనీలో తాను పెట్టిన 30 శాతం పెట్టుబడులు తిరిగి ఇచ్చేయాలని రాహుల్‌ను విజయ్‌కుమార్‌ కోరినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు తెలిపారు. అందుకు రాహుల్‌ అంగీకరించకపోవడంతో... విజయ్‌కుమార్‌.. కోగంటి సత్యాన్ని కలిశాడు. ఇదే అదనుగా భావించిన కోగంటి సత్యం.. కంపెనీని చౌకగా కొట్టేసేందుకు ప్లాన్‌ చేశాడు. తక్కువ ధరకు కంపెనీలో 90 శాతం వాటాను తనకు ఇవ్వాలని రాహుల్‌ను కోరాడు ఇందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి హత్యకు ప్లాన్‌ చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చారు.

రూ.6 కోట్లు వసూల్

రూ.6 కోట్లు వసూల్

మెడికల్ సీటు ఇప్పిస్తానని గాయత్రి వద్ద రాహుల్ రూ.6 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ సీటు ఇప్పించకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని గాయత్రి.. రాహుల్‌పై ఒత్తిడి తెచ్చింది. రాహుల్ తండ్రి రాఘవరావు తొలుత రూ.50 లక్షలు ఇస్తామని గాయత్రికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీన రాత్రి 7.30 నిమిషాలకు గాయత్రి.. రాహుల్‌కు ఫోన్ చేయగా.. ఒక్కడే కారులో బయటకు వెళ్లాడు. ఆమె మాట్లాడిన తర్వాత రాహుల్ కారులో కోరాడ విజయ్, సీతయ్య, బాబూరావు ఎక్కారు. డబ్బులు తెచ్చావా..? అని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కారులో ఉన్న సీతయ్య అనే వ్యక్తి రాహుల్ మెడకు వైరు బిగించగా.. బాబూరావు దిండుతో మొహాన్ని అదిపట్టుకున్నాడు. దీంతో అక్కడికక్కడే రాహుల్ మృతి చెందాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

Recommended Video

    PV Sindhu Visits Kanaka Durga Temple దుర్గమ్మ ఆశీస్సుల తోనే.. | Olympics || Oneindia Telugu
    రాహుల్ డెడ్ బాడీ

    రాహుల్ డెడ్ బాడీ

    గుణదల వద్ద కారులో గుర్తుతెలియని శవం ఉన్నట్లు సమాచారం అందింది. అది రాహుల్ మృతదేహంగా గుర్తించి పోస్ట్‌మార్టంకు తరలించారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కోరాడ విజయ్ కుమార్, కోగంటి సత్యం పాత్ర ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. రాహుల్ హత్యకు విజయవాడకు చెందిన రౌడీ షీటర్ కోగంటి సత్యం స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాహుల్ హత్య కేసులో ఇప్పటికీ ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+