విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అచ్చెన్నాయుడు అరెస్ట్: వందలమంది ఇంట్లో చొరబడ్డారు! భార్య, ఫ్యామిలీ ఏమన్నారంటే?

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిపుట్టించింది. శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

అచ్చెన్నాయుడితో విభేదాలు, అదే నా వీక్నెస్, బాధేసింది: రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు అచ్చెన్నాయుడితో విభేదాలు, అదే నా వీక్నెస్, బాధేసింది: రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు

వందల మంది ఇంట్లో చొరబడి..

వందల మంది ఇంట్లో చొరబడి..


కాగా, అచ్చెన్నాయుడు అరెస్టు తీరుపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిమ్మాడలోని తమ నివాసంలోకి 200 నుంచి 300 మంది గోడదూకి చొరబడ్డారని అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ తెలిపారు. అరెస్టుకు సంబంధించి తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆయన చెప్పారు.

విశ్రాంతి తీసుకుంటున్న అచ్చెన్నాయుడును..

విశ్రాంతి తీసుకుంటున్న అచ్చెన్నాయుడును..


అచ్చెన్నాయుడి అరెస్ట్ అనంతరం ఆయన సతీమణి విజయమాధవి మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం 7.20 గంటలకు.. అప్పుడే స్నానం చేసి కూర్చున్న అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని తెలిపారు. ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఆరోగ్యం కూడా బాగా లేదని చెప్పారు. గురువారం చిన్న సర్జరీ జరిగిందని.. వైద్యుల సూచన మేరకు ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని ఆమె తెలిపారు. మందులు వేసుకోవాలని చెప్పినా వినకుండా తీసుకెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ కుట్రలో భాగమే అరెస్టు..

రాజకీయ కుట్రలో భాగమే అరెస్టు..

ఇక తెలుగుదేశం పార్టీ నేతలు అధికార వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీ నేత అచ్చెన్నాయుడును కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులు సరికాదన్నారు. రాజకీయ కుట్రలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను వాడుకోవడం దారుణమని విమర్శించారు. ఏపీలో జరుగుతున్న కక్షపూరిత రాజకీయాలను ప్రతీ ఒక్కరూ ఖండించాలన్నారు.

Recommended Video

TDP Atchannaidu Arrest || ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ ముఖ్యనేత అచ్చెన్నాయుడు పాత్ర....!!
అరెస్టుకు భారీ మూల్యం తప్పదు..

అరెస్టుకు భారీ మూల్యం తప్పదు..

టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం దుర్మార్గమని మరో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. రాజకీయంగా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రిని అక్రమ కేసుల్లో ఇరికించడం కుట్ర కాదా? అని నిలదీశారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. నోటీసులు ఇచ్చి వివరణ కూడా ఇవ్వకుండా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. బీసీ నాయకులను అణగదొక్కేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు

English summary
200 persons entered into my house for arrest Atchannaidu, says his family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X