ఓటు లేదా..సమస్యలున్నాయా..ఇక ఈ నెంబర్ కు కాల్ చేసేయండి..
తెలంగాణ ఎన్నికల తరువాత ఏపిలోనూ ఓటు కోసం కొందరిలో టెన్షన్ మొదలైంది. ఓట్లు తొలిగిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఓటర్లలో ఉన్న ఆందోళన తొలిగించేందుకు ఏపి ఎన్నికల ప్రధానాధి కారి వినూత్న ప్రయోగం అమల్లోకి తెచ్చారు. ఒక ఫోన్ కాలా ద్వారా ఓటు కు సంబంధిచిన సమాచారం తో పాటుగా సమస్య పరిష్కారం చేసుకోవచ్చు..
టోల్ ఫ్రీ నెంబర్..1950 కు ఫోన్ చేయాలి..

రాష్ట్రంలో ఓటర్లు తమ ఓటు హక్కు గురించి తెలుసుకోవాలన్నా..ఓటు లేని వారు కొత్తగా నమోదు గురించి విచారణ చేయాలన్నా ఈ కాల్ సెంటర్ సహకరిస్తుంది. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా కాల్ సెంటర్ ను ప్రారంభించారు. ఇక్కడ పని చేసే వారిని వ్యక్తిగతంగా కాకుండా...ఓటర్లు తమ సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 1950 కి ఫోన్ చేయాలి. అదే విధంగా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం తెలుసుకొనే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుచొ్చారు. ఓటర్ ఎపిక్ కార్డు నెంబరు..ఇతర వివరాలు అందిస్తే తిరిగి ఎస్ఎంఎస్ ద్వారానే వారికి ఎన్నికల కాల్ సెంటర నుండి సమాధానం వస్తుంది.
24 గంటలు అందుబాటులో..
ఓటర్లకు అంబాటులో ఉండేందుకు కాల్ సెంటర్ కు 30 లైన్లు తీసుకున్నామని, ఈ నంబరుకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఉందని ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే వరకు రోజూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పది మంది సిబ్బందితో ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది. ఎన్నికల సమయంలో 24 గంటలూ మూడు షిఫ్టుల్లో పనిచేస్తుంది. తన వ్యక్తిగత ఫోన్ నంబరు (9491111091)కు ఎస్‌ఎంఎ్‌సలు, వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ రికార్డు పంపితే వారి సమస్యలను పరిష్కరిస్తామని సిసోడియా ప్రకటించారు. ఏపిలోని ఓటరు సమస్యల పరిష్కారం కోసమే త్వరలో ప్రత్యేక యాప్‌ను కూడా ఓటర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఓటుహక్కు గురించి తెలుసుకోవడానికి www.ceoandhra.nic.in, www.nvsp.in వెబ్‌సైట్‌లలో లాగిన్ కావచ్చు. అదే విధం గా..mhmi. ap votevoter id అని టైపు చేసి 9223166166 లేదా 51969కు సమాచారం పంపించవచ్చని సిసోడియా సూచించారు. ఈ కాల్ సెంటర్ ద్వారా ఓటు లేదనే ఆందోళన ఉన్నవారు...గల్లంతు అయిన వారు వెంటనే సమాచారం తెలుసుకోవచ్చు..












Click it and Unblock the Notifications