Rahul murder case:మరో నలుగురి అరెస్ట్.. ఇద్దరీ కోసం కొనసాగుతోన్న గాలింపు
బెజవాడ బిజినెస్ మేన్ రాహుల్ హత్య కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ మరో నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ సీతయ్య, బాబురావు, రాజబాబు, కరణం రమేష్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 13 మందిలో 11 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

చిట్ ఫండ్.. కోరాడ విజయ్‌కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్‌ఫండ్ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్‌ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్‌కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్‌కుమార్ రాహుల్‌ను కోరాడు.
xకోరాడ విజయ్‌కుమార్, ఆయన స్నేహితురాలు గాయత్రి గత కొన్నేళ్లుగా కోరాడ చిట్‌ఫండ్ కంపెనీ నడుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి నష్టపోయిన ఆయనపై అప్పులవాళ్లు తమ డబ్బు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేయసాగారు. మరోవైపు చిట్‌ఫండ్ కంపెనీ డబ్బు సైతం ఎన్నికల్లో వినియోగించడంతో.. అక్కడా ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్, విజయ్‌కుమార్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలోని తన వాటా తీసుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా విజయ్‌కుమార్ రాహుల్‌ను కోరాడు.

రాహుల్‌పై కోపం..
ఈ విషయంలో స్పందించకపోవడంతో రాహుల్‌పై ఆగ్రహంతో ఉన్నాడు. విజయ్‌కుమార్ స్నేహితురాలు గాయత్రికి రాహుల్ రూ.6 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆమెకు సైతం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉంది. అలాగే జిక్సిన్ సిలిండర్స్ కంపెనీలో పనిచేస్తున్న సీతయ్యకు లాజిస్టిక్స్ బిజినెస్‌లో కాంట్రాక్ట్ ఇస్తానని హామీ ఇచ్చి నేరవేర్చకపోవడంతో రాహుల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ పరిస్థితులే రాహుల్ హత్యకు దారితీశాయి.చెప్పారు.

ఇద్దరు కలిసి
రాహుల్ హత్య కేసులో సూత్రధారి కోగంటి సత్యం, పాత్రధారి కోరాడ విజయ కుమార్ అని పోలీసులు తేల్చారు. హత్యకు ముందు రాహుల్‌ను దారుణంగా కొట్టారని.. తలపై అనేకసార్లు కొట్టడంతో అతని మెదడు నరాలు కూడా చిట్లినట్టు గుర్తించారు. కారులోనే తాడుతో ఉరేసి చంపి... ఆ స్థానంలో మరొ తాడుని ఉంచినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. పోలీసులకు సాక్ష్యాధారాలు దొరకకుండా నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించినట్టు తెలుస్తోంది. రాహుల్ ఒక ఫోన్ మాయం చేయడం.. బినామీ పేర్లతో కొత్త ఫోన్లు, కొత్త సిమ్ కార్డులు తీసుకొని వినియోగించినట్టు ఇందులో భాగమనేనని పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు రెండు చోట్ల సెటిల్ మెంట్‌కి ప్రయత్నించారు. అక్కడ మాట వినకపోవడంతో రాహుల్‌ని తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది.

30 శాతం వాటా..
ఫ్యాక్టరీని కోగంటి సత్యానికి అమ్మేసి తన 30 శాతం వాటా డబ్బులు ఇవ్వాలని కోరాడ విజయ్ ఒత్తిడి తీసుకొచ్చాడని పోలీసులు గుర్తించారు. కోగంటి సమక్షంలో బలవంతంగా కంపెనీ షేర్లు మార్పిస్తూ పేపర్లపై సంతకాలు పెట్టించి.. అక్కడే రాహుల్‌ని మరోసారి దారుణంగా కొట్టినట్టు తెలుస్తోంది. రాహుల్‌ని చంపేయాలని కోగంటి, కోరాడ తమ అనుచరులకు ఆదేశించారని.. వారి ఆదేశాలతో కారులోనే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక విషయాలు పొందుపర్చారు. వాటా అమ్మే విషయంలో రాహుల్, విజయ్‌కుమార్ మధ్య తలెత్తిన వివాదాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు కోగంటి సత్యం ప్రయత్నించినట్టు పేర్కొన్నారు. చౌకగా కంపెనీని కొట్టేయాలని కోగంటి ప్రణాళిక రచించినట్టు తేల్చారు. నామమాత్రపు ధరకు కంపెనీని అమ్మేందుకు రాహుల్ అంగీకరించనందునే.. హత్యకు కుట్రపన్నినట్టు పోలీసులు నిర్ధారించారు.

రాహుల్ వాటా ఇదీ
జిక్సిన్ కంపెనీలో రాహుల్‌కు 40 శాతం వాటా ఉండగా.. విజయ్‌కుమార్‌కు 30 శాతం వాటా ఉన్నాయి. బొబ్బా స్వామి కిరణ్, రాహుల్ చౌదరికి కలిపి మరో 30 శాతం వాటా ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో కోరాడ విజయ్‌కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు ఖర్చు చేసిన విజయ్‌కుమార్‌ను.. అప్పులు ఇచ్చిన వారు వేధించడం మొదలు పెట్టారు. దీంతో జిక్సిన్ కంపెనీలో తాను పెట్టిన 30 శాతం పెట్టుబడులు తిరిగి ఇచ్చేయాలని రాహుల్‌ను విజయ్‌కుమార్ కోరినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు తెలిపారు. అందుకు రాహుల్ అంగీకరించకపోవడంతో... విజయ్‌కుమార్.. కోగంటి సత్యాన్ని కలిశాడు. ఇదే అదనుగా భావించిన కోగంటి సత్యం.. కంపెనీని చౌకగా కొట్టేసేందుకు ప్లాన్ చేశాడు. తక్కువ ధరకు కంపెనీలో 90 శాతం వాటాను తనకు ఇవ్వాలని రాహుల్‌ను కోరాడు ఇందుకు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి హత్యకు ప్లాన్ చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చారు.

రూ.6 కోట్లు వసూల్
మెడికల్ సీటు ఇప్పిస్తానని గాయత్రి వద్ద రాహుల్ రూ.6 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ సీటు ఇప్పించకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని గాయత్రి.. రాహుల్‌పై ఒత్తిడి తెచ్చింది. రాహుల్ తండ్రి రాఘవరావు తొలుత రూ.50 లక్షలు ఇస్తామని గాయత్రికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీన రాత్రి 7.30 నిమిషాలకు గాయత్రి.. రాహుల్‌కు ఫోన్ చేయగా.. ఒక్కడే కారులో బయటకు వెళ్లాడు. ఆమె మాట్లాడిన తర్వాత రాహుల్ కారులో కోరాడ విజయ్, సీతయ్య, బాబూరావు ఎక్కారు. డబ్బులు తెచ్చావా..? అని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. కారులో ఉన్న సీతయ్య అనే వ్యక్తి రాహుల్ మెడకు వైరు బిగించగా.. బాబూరావు దిండుతో మొహాన్ని అదిపట్టుకున్నాడు. దీంతో అక్కడికక్కడే రాహుల్ మృతి చెందాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications