మెరిసిన హిట్ పెయిర్ బాలయ్య-ప్రగ్యా జైస్వాల్: విషాదంలో నుంచి కోలుకుని హుషారుగా
ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవ్వాళ విజయవాడలో సందడి చేశారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో కలిసి ఓ జ్యువెలరీ షాప్ ను ప్రారంభించారు.
విజయవాడ: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. ఇవ్వాళ విజయవాడలో తళుక్కున మెరిశారు. లబ్బీపేట నందమూరి రోడ్ లో ఏర్పాటు చేసిన వేగా అతిపెద్ద జ్యువెలరీ షోరూంను ప్రారంభించారు. వేగ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తోన్నారు వారిద్దరూ. ఇప్పటికే ఈ షోరూం యాజమాన్యం చిత్రీకరించిన యాడ్ లో కనిపించారు. బాలకృష్ణ- ప్రగ్యా జైస్వాల్ వస్తోన్నారనే విషయం తెలియగానే వేల సంఖ్యలో నందమూరి అభిమానులు లబ్బీపేటకు చేరుకున్నారు.
ఆయనను చూడటానికి ఎగబడ్డారు. షోరూమ్ ను ప్రారంభించిన అనంతరం.. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులను పలకరించారు. అభిమానులు లేనిదే తనలాంటి కళాకారులు లేరని చెప్పారు. అభిమానుల వల్లే తాము ఈ స్థితిలో ఉన్నామని వ్యాఖ్యానించారు.

తాను ఓ జ్యువెలరీ షాప్ ను ప్రారంభించడానికి వస్తోన్నానంటే చాలామంది రకరకాలుగా మాట్లాడుకున్నారని, వాటిని తాను పట్టించుకోనని బాలయ్య చెప్పుకొచ్చారు. తెలుగువారిని ముందుండి నడిపించడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని పేర్కొన్నారు. తమ ఇంటి పేరుతో ఉన్న నందమూరి రోడ్ లో ఈ షోరూంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు బాలకృష్ణ. తారకరత్న మరణంతో విషాదంలో కూరుకుపోయిన బాలకృష్ణ.. ఇప్పుడు హుషారుగా కనిపించడం ఆయన అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.
Lion 🦁 like personality... Child like mentality ❤️ pic.twitter.com/ODG4oNvr1T
— Balayya Yuvasena (@BalayyaUvasena) March 8, 2023
ఈ సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన నటించే తరువాతి సినిమా ఎన్బీకే 108. అనిల్ రావిపూడి దర్శకుడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉందీ మూవీ. ఓ షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తయింది. తారకరత్న గుండెపోటుకు గురికావడం, బెంగళూరు నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో సుమారు నెల రోజుల పాటు చికిత్స అనంతరం కన్నుమూయడం వంటి సంఘటనల్లో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇప్పుడిప్పుడే ఈ విషాదం నుంచి బాలకృష్ణ బయటికొస్తోన్నారు. తాజాగా విజయవాడలో సందడి చేశారు.












Click it and Unblock the Notifications