ఎంపీ కేశినేని నానీ మరో పోస్టు .. భయం తన రక్తంలో లేదట .. ఎవరికి ఈ తాజా సందేశం !
Recommended Video
ఏపీ రాజకీయాల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ఫేస్ బుక్ వేదికగా సంచలనాలకు తెర తీసిన కేశినేని నాని మొన్నటికి మొన్న పెట్టిన పోస్ట్ తో అటు కొడాలి నానికి, దేవినేని కి మధ్య ఉన్న పాత ఘర్షణలను గుర్తు చేసి టీడీపీలో కలకలం రేపారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి పెద్ద తలనొప్పిగా తయారైన కేశినేని నాని టీడీపీలో కొనసాగుతూనే సంచలన వ్యాఖ్యలు చేయడం తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.
మళ్ళీ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి నానీ సంచలనం .. ఈసారి భయం నా రక్తంలో లేదని వ్యాఖ్య
టీడీపీ ఎంపీ కేశినేని నాని ఫేస్ బుక్ వేదికగా మరో సంచలన పోస్ట్ పెట్టారు తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వ్యక్తిని కానని ,తన వ్యక్తిత్వం అలాంటిది కాదని కేశినేని నాని కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ చూస్తే "నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను. నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని. భయం నా రక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు. ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదు" అని పేర్కొన్నారు.

మోడీనే నిండుసభలో నిలదీశానని పోస్ట్ లో పేర్కొన్న నానీ .. ఎవరినుద్దేశించి నానీ పోస్టులు
ఇక ఇందులో తాను ఎవరికీ భయపడని, భయం తన రక్తంలో లేదని పేర్కొన్న కేశినేని నాని రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాను అంటూ , నిండు సభలో మోడీని నిలదీసినవాడిని అంటూ పేర్కొన్నారు. ఇక ఆయన అసలు ఉద్దేశం టిడిపి అర్థం చేసుకోవాలి అనా లేకుంటే తాను ఉన్నదున్నట్టు మాట్లాడే స్వభావం ఉన్న వాడిని అని ప్రజలకు చెప్పాలనా అన్నది అర్థం కాని పరిస్థితి. టిడిపి విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కేశినేని నాని ఇంకా చల్లబడలేదు. చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడినప్పటికీ బేఖాతరు చేస్తూ కేశినేని నాని తన పంథాను వీడలేదు. ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడుతున్న కేశినేని నాని అసలు ఆంతర్యమేమిటో నానికే ఎరుక .
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications