విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ పోలీసులకు అలర్ట్.. చనిపోతానంటూ పట్టాలపై పడుకున్న యువకున్ని కాపాడండి

|
Google Oneindia TeluguNews

ఓ ప్రేమికుడి కథ రైలు పట్టాలెక్కింది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. అమ్మాయి బంధువులు తనపై కేసు పెట్టడమే గాకుండా తన ఫ్యామిలీని వేధిస్తున్నారనేది ఆ ప్రేమికుడి కథ తాలూకు సారాంశం. అంతేకాదు తన ప్రేమాయణమంతా ఫేస్ బుక్ తెరపైకి ఎక్కించాడు. ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను పబ్లిష్ చేశాడు. సూసైడ్ చేసుకుంటానంటూ అందులో పేర్కొన్నాడు.

విజయవాడకు చెందిన మడి శివ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కడం లేదని వాపోయాడు. అమ్మాయి తరపు బంధువులు పోలీసులకు డబ్బులు ఇచ్చి తనపై కేసు నమోదు చేశారని ఆరోపించాడు. అంతేకాదు తన కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారని చెబుతున్నాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ ను రోడ్డు మీదకు తెచ్చారనే అవమానంతో "ఆత్మహత్య" నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. రైలు పట్టాలపై తల పెట్టి చనిపోతానంటూ ఫోటోలు పోస్ట్ చేశాడు. ఇదంతా ఫేస్ బుక్ లో పబ్లిష్ చేయడంతో విషయం కాస్తా వైరల్ గా మారింది.

ప్రేమకు పెద్దలు అడ్డమా..?

ప్రేమకు పెద్దలు అడ్డమా..?

విజయవాడ యువకుడు మడి శివ ప్రేమలో విఫలమయ్యానంటూ పోస్ట్ బుక్ లో చేసిన పోస్టింగ్ ఇప్పుడు వైరలయింది. ఒక అమ్మాయిని ఏడాదిన్నరగా ప్రేమిస్తున్నానని.. వాటికి సాక్ష్యం అనే రీతిలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశాడు. అమ్మాయి తరపు బంధువులు తమ ప్రేమకు అడ్డుపడుతున్నారని పేర్కొన్నాడు. ఆ అమ్మాయికి తనంటే చాలా ఇష్టమని.. అయితే ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేసేందుకు వారు సిద్ధపడుతున్నారని ఆరోపించాడు. అంతేగాకుండా తనపై కేసు పెట్టించి ఫ్యామిలీ మెంబర్స్ ను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రాశాడు. పోలీసులు కూడా అమ్మాయి బంధువుల నుంచి డబ్బులు తీసుకుని తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపాడు.

నా ప్రేమతో కుటుంబానికి కష్టాలు.. అందుకే సూసైడ్ నిర్ణయం

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనకు దక్కడం లేదని.. అంతేగాకుండా ఆ అమ్మాయి తరపు బంధువులు తమ కుటుంబ సభ్యులు రోడ్డు మీదకు తెచ్చారని పేర్కొన్నాడు. ఆ అమ్మాయిని ప్రేమించిన కారణంగా తన కుటుంబం చాలా బాధలు పడుతోందని రాశాడు. పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించాడు. అందుకే తనవల్ల ఫ్యామిలీ ఇబ్బందులు పడటం చూడలేక రైలు పట్టాలపై తల పెట్టి చనిపోతానంటూ మరో పోస్ట్ పెట్టాడు. రైల్వే ట్రాక్ పై నిలబడిన ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. చనిపోవడం సమస్యకు పరిష్కారం కాదంటూ చాలామంది సూచించారు.

నీది నిజమైన ప్రేమా? కామెంట్ల వర్షం

నీది నిజమైన ప్రేమా? కామెంట్ల వర్షం

ప్రేమ కారణంగా చనిపోవడమేంటి?. నీది నిజమైన ప్రేమేనా?. ఒకవేళ నీది నిజమైన ప్రేమే అయితే ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఎందుకు పోస్ట్ చేశావు? నీవు చనిపోతే నీ మీద ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రుల పరిస్థితేంటి? ఇలా శివ పెట్టిన పోస్టింగ్ లపై నెటిజన్లు కామెంట్లు పెట్టారు. చావుతో సమస్య పరిష్కారం కాదు గదా. పోలీస్ స్టేషన్ కు వెళ్లి నీ ప్రేమ గురించి నిర్భయంగా చెప్పాలే గానీ ఇలా ఆ అమ్మాయి ఫోటోలు పబ్లిష్ చేయడం సంస్కారం కాదంటూ మరికొందరు స్పందించారు.

English summary
Madi Shiva, a young man from Vijayawada, was ready to commit suicide by name of love. The girl's relatives allegedly filed a case against the police and lodged a case against him. It is also said that his family members are harassing by police. He posted the photographs that he could not bear the shame and lay his head on the train rails. When it's published in the Facebook page, it becomes viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X