గుణదల మేరీమాత ఉత్సవాలపై కీలక నిర్ణయం
విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతకు అడ్డుకట్ట పడట్లేదు. రోజువారీ పాజిటివ్ కేసులు వేల సంఖ్యల్లో నమోదవుతున్నాయి. శనివారం నాడు 11 వేలకు పైగా కొత్త కేసులు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చాయి. ఇదివరకటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గిందే తప్ప.. ఆ ఉధృతిలో మార్పు ఉండట్లేదు. అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు జిల్లాల్లో వెయ్యికి పైగా రికార్డయ్యాయి. కోవిడ్ మరణాల సంఖ్య పరిమితంగానే ఉండటం ఊరట కలిగిస్తోంది.
వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో 11,573 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య లక్షను దాటింది. 1,15,425గా రికార్డయింది. ఇప్పటిదాకా కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య 14,594కు చేరింది. గుంటూరు, కడప, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు-1,298, కడప-1,942, కర్నూలు-1,522, విశాఖపట్నం-1,024 కేసులు వెలుగులోకి వచ్చాయి.కేసీఆర్-జగన్ మధ్య తేడా ఇదీ: కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరుతో రాజకీయ పరిణితి: మర్రి
Read more at: https://telugu.oneindia.com/news/telangana/new-districts-in-ap-telangana-congress-leader-marri-sasidhar-reddy-praised-to-cm-ys-jagan-311402.html

అనంతపురం-926, చిత్తూరు-479, తూర్పు గోదావరి-951, కృష్ణా-969, నెల్లూరు-706, ప్రకాశం-655, శ్రీకాకుళం-274, విజయనగరం-247, పశ్చిమ గోదావరి-580 కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ బిషప్ డాక్టర్ తెలగతోటి జోసెఫ్ రాజారావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సరం గుణదల మేరీమాత ఉత్సవాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆదివారం నాడు చర్చ్‌లల్లో నిర్వహించే ప్రార్థనల సందర్భంగా ఈ విషయాన్ని భక్తులకు తెలియజేయాలని విజయవాడ బిషప్ విజ్ఞప్తి చేశారు. లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారని, భౌతిక దూరాన్ని పాటించడం కష్టతరమౌతుందని, గుణదల మేరీమాత ఉత్సవాల సమన్వయ కమిటీ వివరించిందని అన్నారు.
ప్రతి సంవత్సరం మేరీమాత వార్షిక ఉత్సవాలు విజయవాడ సమీపంలోని గుణదలలో ఏర్పాటవుతుంటాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన ఆరంభం కావాల్సి ఉంది. 11వ తేదీన ముగియాల్సి ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున క్రైస్తవులు ఈ వేడుకలకు హాజరవుతుంటారు. ఉత్సవాల ముగింపు నాడు భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. కోవిడ్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని నిర్వహించడం సరికాదని బిషప్ జోసెఫ్ రాజారావు పేర్కొన్నార. కోవిడ్ వ్యాప్తికి కారణం కాకూడదనే ఉద్దేశంతోనే రద్దు చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications