విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రామ, వార్డు క్లినిక్స్: తండ్రి పేరుతో మరో పథకానికి జగన్ శ్రీకారం: ప్రతి ఒక్కరికీ కరోనా సొకవచ్చు

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో మరో వినూత్న పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మొన్నటిదాకా గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్లు.. ఆ తరువాత గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలతో ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లిన ప్రభుత్వం.. ఇక వైద్యాన్ని కూడా వారికి చేరువ చేయబోతోంది. దీనికోసం గ్రామ, వార్డు స్థాయిల్లో ప్రత్యేకంగా క్లినిక్‌లను ఏర్పాటు చేయబోతోంది. దీనికి వైఎస్ఆర్ గ్రామ క్లినిక్, వైఎస్ఆర్ వార్డు క్లినిక్‌గా పేరు పెట్టబోతోంది. గ్రామ సచివాలయాల తరహాలోనే..ప్రతి విలేజ్ క్లినిక్‌లోనూ ఓ డాక్టర్, హెల్త్ వర్కర్లను నియమించనుంది.

ఏపీలో పాఠశాల విద్యలో మరో కీలక మార్పు: ఇక ప్రభుత్వ ప్రీ స్కూళ్లు: ప్రైవేటుకు ధీటుగా.. ఏపీలో పాఠశాల విద్యలో మరో కీలక మార్పు: ఇక ప్రభుత్వ ప్రీ స్కూళ్లు: ప్రైవేటుకు ధీటుగా..

 మొహల్లా క్లినిక్‌ల తరహాలో..

మొహల్లా క్లినిక్‌ల తరహాలో..

ప్రస్తుతం ఈ తరహా వైద్య విధానంలో ఢిల్లీలో అమల్లో ఉంది. అక్కడి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మొహల్లా క్లినిక్‌ల పేరుతో ఆధునిక వైద్యాన్ని కూడా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చేరువ చేసింది. అదే తరహాలో ఏపీలో కూడా గ్రామ, వార్డు క్లినిక్‌లను నెలకొల్పడానికి ప్రభుత్వం సన్నహాలను చేస్తోంది. కరోనా వైరస్ ప్రభావం సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుందని ఇదివరకే వెల్లడించిన వైఎస్ జగన్.. అదే సమయంలో ఈ గ్రామస్థాయి క్లినిక్‌లను అందుబాటులోకి తీసుకుని రాబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రతి క్లినిక్‌లోనూ కరోనా టెస్టులు..

ప్రతి క్లినిక్‌లోనూ కరోనా టెస్టులు..

కొత్తగా నెలకొల్పబోయే ప్రతి క్లినిక్‌లో కూడా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లను చేయబోతోంది ప్రభుత్వం. దీనికి అవసరమైన వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకుని రానుంది. వైద్య పరికరాల కొరత ఏర్పడమంటూ జరిగితే.. 10 క్లినిక్‌లకు కలిపి ఒక యూనిట్‌గా తీసుకుని కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించడం, ఆ వైరస్ బారిన పడినప్పటికీ..సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరగలమనే ఆత్మవిశ్వాసాన్ని ప్రజలకు కల్పించేలా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

స్పందన కార్యక్రమంలో సూచనప్రాయంగా వెల్లడించిన జగన్

స్పందన కార్యక్రమంలో సూచనప్రాయంగా వెల్లడించిన జగన్

మంగళవారం స్పందన పేరుతో కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా జగన్.. ఈ క్లినిక్‌ల గురించి ప్రస్తావించారు. కరోనా వైరస్‌ నివారించడానికి అవసరమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకూ దానితో కలిసి జీవించాల్సి ఉంటుందనే భావనను ప్రజల్లో కల్పించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. భవిష్యత్తులో కరోనా వైరస్ ప్రతి ఒక్కరికీ సోకే అవకాశాలు లేకపోలేదని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా పనిచేశారని ఆయన ప్రశంసించారు. క్షేత్ర స్థాయిలో గ్రామ వాలంటీర్, సచివాలయం, ఆశావర్కర్లు, ఏఎస్‌లు, డాక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులు కృషి చేశారని చెప్పారు.

 ప్రజల్లో అవగాహన పెంపొందించేలా..

ప్రజల్లో అవగాహన పెంపొందించేలా..

ప్రజలు స్వచ్ఛందంగా తమ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పే పరిస్థితి రావాలని, అలాంటి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జగన్ అన్నారు. పరీక్షలకోసం ఎవర్ని సంప్రదించాలి? ఎక్కడకు వెళ్లాలి? ఎలా పరీక్షలు చేయించుకోవాలనే సందేహాలు వారిలో ఉన్నాయని, దీన్ని నివారించడానికి రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ను తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. అనుమానం ఉన్నవారు గ్రామ క్లినిక్‌లకు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకునేలా ప్రజలను చైతన్య పరుస్తామని చెప్పారు.

Recommended Video

Amphan Cyclone : Uppada Coast, Kakinada Port On High Alert
రెండు, మూడు రోజుల్లో ప్రజా రవాణా..

రెండు, మూడు రోజుల్లో ప్రజా రవాణా..

మరో రెండు, మూడు రోజుల్లో ప్రజా రవాణాను అందుబాటులోకి తీసుకొస్తామని వైఎస్ జగన్ అన్నారు. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు తప్ప మిగిలిన చోట్ల సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు ప్రారంభం అవుతాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సి ఉంటుందని, భౌతిక దూారాన్ని పాటించాల్సి ఉంటుందని జగన్ అన్నారు.

English summary
Andhra Pradesh Chief Miniser YS Jagan have announced the Village and Ward Clinics for poor and needy people across the State. The YSR Village/Ward Clinics will be established soon, he said in Video Conference with all district collectors on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X