మాస్క్‌లు అడిగితే సస్పెండ్ చేశారు... కృష్ణాజిల్లాలో దారుణం- లైన్‌మెన్ల ఆందోళన...
విజయవాడ : ఏపీలోని కృష్ణాజిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఉద్యోగులు, ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్దితి లేదు. అయినా కేంద్రం ఇచ్చిన మినహాయింపులతో జనం మాస్కులు ధరించి రోడ్లపై తిరుగుతున్నారు. కరోనా ప్రభావంతో ఉద్యోగులు కూడా విధుల్లోకి వెళ్లేందుకు తటపటాయిస్తున్నారు. అలా విధుల్లోకి వెళ్లేందుకు మాస్కు అడిగిన ఓ విద్యుత్ శాఖ ఉద్యోగి సస్పెండయ్యాడు.
కృష్ణాజిల్లా విసన్నపేటలో విధి నిర్వహణలో భాగంగా కరోనా మాస్కులు అడినందుకు అనిల్ కుమార్ అనే లైన్‌మెన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన ఘటన కలకలం రేపింది. విధి నిర్వహణలో భాగంగా ఇంటింటికీ వెళ్లాల్సి ఉన్నందున తనకు మాస్కులు ఇవ్వాలని అనిల్ కుమార్ కోరగా... మాస్కులు ఇవ్వకపోగా సస్పెండ్ చేయడం సంచలనం రేపింది. విస్సన్నపేట డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీరు అశోక్ కుమార్ ఉద్ధేశ్యపూర్వకంగా తనను సస్పెండ్ చేయించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. అవినీతిపరుడైన అశోక్ కుమార్ మాస్కులు అడిగాడన్న కారణంతో తన కింద లైన్‌మెన్‌గా పనిచేస్తున్న అనిల్‌ను సస్పెండ్ చేయించడంపై లైన్‌మెన్లు ధర్నాకు దిగారు

ఇప్పటికే విశాఖలో మాస్కులు, ఇతర రక్షణ పరికరాలు ఇవ్వలేదని ఆరోపించిన డాక్టర్ సుధాకర్‌పై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు విమర్శలకు తావిచ్చారు. ఇప్పుడు కృష్ణాజిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సస్పెండ్ చేసిన లైన్‌మెన్‌ను విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications