Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ సర్కారుకు భారీ షాక్- మరోసారి ఎస్ఈసీగా నిమ్మగడ్డ - గవర్నర్ ఆదేశం...

ఏపీలో జగన్ ప్రభుత్వానికి మరో భారీ షాక్ తగిలింది. స్ధానిక ఎన్నికలను వాయిదా వేశారన్న కారణంతో ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి అదే పదవిలో నియమించేలా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి గవర్నర్ లేఖ రాశారు. దీనిపై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.

 జగన్ సర్కారుకు భారీ షాక్...

జగన్ సర్కారుకు భారీ షాక్...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ సర్కారుకు ఇవాళ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది మార్చినెలలో స్ధానిక ఎన్నికల ప్రక్రియను కరోనా సాకుతో వాయిదా వేశారన్న ఆగ్రహంతో హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించిన జగన్ సర్కారుకు న్యాయస్ధానాలు తొలుత షాక్ ఇవ్వగా.. ఇప్పుడు గవర్నర్ కూడా మరో షాక్ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డను నియమించాలని సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ హరిచందన్ ఇవాళ లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది. గవర్నర్ ఆదేశాల మేరకు నిమ్మగడ్డను తిరిగి ఎన్నికల కమిషనర్ పదవిలో నియమించాల్సిన పరిస్ధితి జగన్ సర్కారుకు ఎధురైంది.

 ప్రభుత్వానికి గవర్నర్ లేఖ...

ప్రభుత్వానికి గవర్నర్ లేఖ...


నిమ్మగడ్డను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాలని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. దీంతో నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు.. తన పునర్ నియామకంపై గవర్నర్ ను కలవాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ ను కలిసిన నిమ్మగడ్డ తనకు సానుకూలంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో గవర్నర్ హరిచందన్ ఇవాళ లేఖ రాశారు. ఇందులో హైకోర్టు ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని సూచించారు. అదే సమయంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చినట్లు నిమ్మగడ్డకు గవర్నర్ కార్యదర్శి నుంచి మరో లేఖ అందింది.

Recommended Video

    YSRCP MP Vijaya Sai Reddy Tested COVID-19 Positive || Oneindia Telugu
     జగన్ అమలు చే్స్తారా ?

    జగన్ అమలు చే్స్తారా ?


    హైకోర్టు ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాలని సూచిస్తూ గవర్నర్ జగన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే నిమ్మగడ్డ వ్యవహారంలో ముందునుంచీ పట్టుదలగా వ్యవహరిస్తున్న జగన్ సర్కార్... ఈ ఆదేశాలను అమలు చేయక తప్పని పరిస్ధితి నెలకొంది. ఆ లోపు సుప్రీంకోర్టులో పిటిషన్ ను కారణంగా చూపుతూ ఈ ఆదేశాలను ప్రభుత్వం పక్కనబెట్టే అవకాశాలూ లేకపోలేదు. లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగా.. గవర్నర్ ఆదేశాలు ఇవ్వడంపై ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలూ ఉన్నాయి. లేదా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ వేచి చూస్తామని చెప్పే అవకాశం కూడా ఉంది. వీటిలో ప్రభుత్వం ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోనుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+