విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం దుకాణాలు ఇక రాత్రి 8 వరకే: చివరి గంటల్లో భారీ ఆఫర్లు: వ్యాపారుల పాట్లు..!

|
Google Oneindia TeluguNews

మరి కొద్ది గంటల్లో ఏపీలోని మద్యం దుకాణాలు ఇక ప్రభుత్వ నియంత్రణలోకి రానున్నాయి. మద్యం అమ్మకాల సమయాలను తగ్గించేసారు. దీంతో..ఈ రోజుల ప్రైవేటు మద్యం దుకాణాల్లో అమ్మకాలకు చివరి రోజు కావటంతో ఉన్న సరుకును వదిలించుకొనేందుకు వ్యాపారులు తిప్పలు పడుతున్నారు. ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకే విక్రయాలు చేస్తున్నారు. ప్రీమియం బ్రాండ్లపై రూ.1000 వరకు తగ్గింపు అమలు చేస్తున్నారు. మంగళవారం నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. సమయంతో పాటుగా విక్రయాల విషయంలోనూ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నారు. బీర్లు..లిక్కర్ పరిమితంగానే అమ్మకాలు సాగిస్తారు. దీంతో..ఇక మద్యం అమ్మకాలు మొత్తం ఎక్సైజ్ శాఖ పరిధిలోకి వెళ్లనుంది.

ఉదయం 11 నుండి రాత్రి 8 గంటల వరకే..
ఏపీలో ప్రభుత్వం మద్యం నిషేదం దిశగా విడతల వారీగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా..మంగళవారం నుండి ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండవు. పూర్తిగా ప్రభుత్వమే మద్యం విక్రయాలను నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మద్యం దుకాణాలను 20శాతం మేర తగ్గించింది ప్రభుత్వం. అంతేకాదు వైన్ షాపుల్లో మద్యం అమ్మే వేళల్లో కీలక మార్పులు చేసింది. రేపటి నుంచి ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు మాత్రమే మద్యం షాపులు తెరిచి ఉంటాయి. ఏపీలో 4,380 మద్యం షాపులు ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఎక్కడైనా నిర్ణయించిన ధర కంటే అధికంగా అమ్మినా..బెల్టు షాపులను ప్రోత్సహించినా చర్యలు తప్పవని ప్రుభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకోవటంతో పాటుగా కొత్తగా కొన్ని నిబంధనలను ఖరారు చేసింది.

Ap govt decided to maintain liquor shops with own staff in restricted timings

కొత్తగా సిబ్బంది ఖరారు..బాధ్యతలు..
ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాల్లో కొత్తగా సిబ్బందిని ఖరారు చేసారు. అందులో ఒక సూపర్ వైజర్.. ముగ్గురు సేల్స్ మున్ ఉంటారు. అదే విధంగా మద్యం వినియోగిస్తే ఎదురయ్యే సమస్యల పైన అవగాహన ..నిషేధం దిశగా అడుగుల్లో భాగంగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,944 మహిళా కానిస్టేబుళ్లను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఇక..ప్రైవేటు దుకాణాలకు అవకాశం లేకపోవటంతో.. చివరికి మిగిలిని సరుకును తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. ప్రీమియం బ్రాండ్లను దాదాపు వెయ్యి రూపాయాల వరకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. చివరి నిమిషంలో సరుకు మిగుల్చుకోవటం కంటే ఎంత వరకు వస్తే అంతకు అమ్మేసుకుంటున్నారు. ఇక, ఇదే సమయంలో ఒక వ్యక్తికి గరిష్ఠంగా మూడు బాటిళ్ల కంటే ఎక్కువ మద్యాన్ని అమ్మడానికి వీల్లేదు .ఎవరి వద్దననా 3 బాటిళ్లకు మించి ఎక్కువ దొరికితే వారిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
English summary
Ap Govt totally closed private liquor shops and started minitain of liquor shops with excise staff. liquor sales timings restricted for 11am to 8 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X