• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీ ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజుల దోపిడీ- కఠిన చర్యలకు విద్యా కమిషన్ ఆదేశాలు..

|

ఏపీలో ప్రైవేటు విద్యాసంస్ధల తీరుపై పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యాసంస్ధల దోపిడీతో పాటు టీచర్ల తొలగింపు, వారికి వేతనాలు ఇవ్వకపోవడం వంటి చర్యలను సీరియస్ గా తీసుకుని చర్యలకు ఉపక్రమించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే విద్యార్ధుల నుంచి ఫీజులను వాయిదాల్లో మాత్రమే వసూలు చేయాలని ఇచ్చిన ఆదేశాలు అమలవుతున్నాయో లేదో కూడా చూడాలని సూచించింది.

మరోసారి కమిషన్ సీరియస్‌...

మరోసారి కమిషన్ సీరియస్‌...

ఏపీలో ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నామన్న పేరుతో భారీగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు విద్యాసంస్ధలను గుర్తించి తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పలుమార్లు హెచ్చరించినప్పటికీ రాష్ట్రంలోని విద్యాసంస్థలు తమ తీరు మార్చుకోవడం లేదని పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో కమిషన్ మరియు ప్రభుత్వం ఇది వరకే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అయినా ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని ఆయన తెలిపారు.

వాయిదాల్లోనే ఫీజు...

వాయిదాల్లోనే ఫీజు...

కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన కొన్ని విద్యాసంస్థలు అధిక ఫీజు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆన్లైన్ క్లాసులకు అనుమతి ఇచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు వసూలు చేసుకోమని చెప్పినట్లు కాదని కాంతారావు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా గత సంవత్సరం ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టించుకోవాలని తెలిపారు. అది కూడా వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలని జస్టిస్. కాంతారావు స్పష్టం చేశారు. దీనికి అదనంగా ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని హెచ్చరించారు.

టీచర్లను తొలగించొద్దు, జీతాలూ ఇవ్వాల్సిందే..

టీచర్లను తొలగించొద్దు, జీతాలూ ఇవ్వాల్సిందే..

మరోవైపు మార్చి నెల నుంచి ఈ ప్రైవేటు విద్యాసంస్థలు ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని మౌఖిక ఆదేశాలతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు, జీతాలు ఇవ్వట్లేదని ఫిర్యాదులు అందుతున్నాయని పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు చెప్పారు. తక్షణమే సిబ్బందికి జీతాలు అందించాలని, తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. దీన్ని బేఖాతరు చేసే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

డి ఈ ఓ లు, ఆర్జేడీ లు, ఆర్ ఐ వో లు తమ పరిధిలో తల్లిదండ్రులతో, ప్రైవేట్ ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న, ఉద్యోగులకు జీతాలు ఇవ్వని విద్యాసంస్థలను గుర్తించాలని ఆయన సూచించారు.

  Rs.5,000 to Plasma Donors కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే.. రూ. 5 వేలు : ఏపీ సర్కార్
  హెల్ప్ లైన్ ఏర్పాటు

  హెల్ప్ లైన్ ఏర్పాటు

  తమ స్థాయిలో సమస్యల పరిష్కారానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలని పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్. కాంతారావు ఆదేశించారు. ఉల్లంఘనలకు పాల్పడిన విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు.

  విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేటు ఉపాధ్యాయులు తమ సమస్యలను నేరుగా రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ కు కూడా తెలియ చేయవచ్చని జస్టిస్ కాంతారావు వెల్లడించారు. 9150381111 కు ఫోన్ ద్వారా (ఫోన్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది), apsermc2020@gmail.com కు ఈ - మెయిల్ ద్వారా, www.apsermc.ap.gov.in పోర్టల్ లో గ్రీవెన్స్ అనే లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

  English summary
  andhra pradesh school education regulatory and monity commission serious on private schools charging heavy fees on students by the name of online classes. commision ordered officials to take necessary action on them immediately.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more