ఉద్యమంపై ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వ హామీతో ఉద్యోగ సంఘాల జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగుల సమస్యలపైన ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. పెండింగ్ బకాయిల చెల్లింపు పై స్పష్టత ఇచ్చింది. మూడు వేల కోట్ల రూపాయల వరకు ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని స్పష్టం చేసింది. డీఏలు.. లీవ్ ఎన్ క్యాష్ మెంట్ ఇతర బకాయిలను రెండు విడతలుగా సెప్టెంబర్ లోగా క్లియర్ చేస్తామని చెప్పుకొచ్చింది. దీంతో..ఆందోళనకు సిద్దమైన ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం నుంచి వచ్చిన హామీతో కొత్త నిర్ణయం తీసుకున్నారు. చర్చల సమయంలో తీసుకున్న నిర్ణయాలు..హామీల అమలు దిశగా వేచి చూసే ధోరణి కొనసాగిస్తూనే.. కొత్త కార్యాచరణ ఖరారు చేసారు.

ముందుగా నిర్ణయించిన ఉద్యమ కార్యాచరణలో ఉద్యోగ సంఘ నేతలు మార్పులు చేసారు. ఉద్యమం కొనసాగుతుందని, ఏప్రిల్‌ 5 వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని జెఎసి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగ సంఘ నేలు స్పష్టం చేసారు. పిఆర్‌సి ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పిఆర్‌సి పే స్కేల్‌ గురించి స్పష్టత ఇవ్వకుండా మొక్కుబడిగా చర్చలకు పిలిచారని తెలిపారు. రిటైర్డు అయిన వారికి బెనిఫిట్స్‌ అందని పరిస్థితి ఉందన్నారు. వేతనాలు ప్రతినెలా ఒకటో తారీఖున ఇవ్వడం సాధ్యపడదని ప్రభుత్వం అంటోందన్నారు. సిపిఎస్‌ ఉద్యోగులకు సంబంధించి రూ.2,600 కోట్లు చెల్లించలేదని చెప్పారు. సిపిఎస్‌ రద్దు మినహా మరే ప్రత్యామ్నాయాన్ని అంగీకరించలేమని స్పష్టం చేసారు.

AP JAC of Govt Employees has decided continue their agitation, Announces Action plan

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను మోసం చేశారని, అందుకే కార్యాచరణ అమలుకు తీర్మానించామని తెలిపారు. ఈ నెల 17, 23 తేదీల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యమానికి మద్దతును కూడగట్టే చేయిచేయి కలుపుదాం అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. 21 నుంచి ఏప్రిల్‌ 5 వరకు వర్క్‌ టు రూల్‌ను కొనసాగిస్తామని అన్నారు. ఈ నెల 27న కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులను కలిసే కార్యక్రమం చేపడతా మన్నారు. అప్పటికీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఏప్రిల్‌ 5న మరోసారి ఎపి జెఎసి అమరావతి రాష్ట్ర కార్యవర్గం సమావేశమై తదుపరి ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+