• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దొంగలకిచ్చే నోబెల్ ప్రైజ్ ఉంటే బాప్ బేటాలకు జాయింట్ గా ఇవ్వాలి.. లోకేష్ , బాబులపై విజయసాయి ఫైర్

|

విజయసాయి రెడ్డి చంద్రబాబు. లోకేష్ బాబు అంటేనే నిప్పులు చెరిగే నేత .. వైసీపీ ఎంపీగా , జగన్ కు సన్నిహితుడిగా , పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబును , బాబు తనయుడు మాజీ మంత్రి లోకేష్ ను తన ట్వీట్ లతో ఉతికి పారేశాడు . ఏపీలో అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేసి మరీ తిడుతున్నారు . అందులో భాగంగా తాజాగా లోకేష్, చంద్రబాబుపై మరోమారు ట్వీట్లతో దాడి చేశారు.

 కేశినేనీ ... మొలతాడు కట్టిన మగాడివే అయితే అనేదాకా వచ్చింది పీవీపీ ముచ్చట .. కేశినేనీ ... మొలతాడు కట్టిన మగాడివే అయితే అనేదాకా వచ్చింది పీవీపీ ముచ్చట ..

  జైలుకు వెళ్తారన్నప్పుడు చంద్రబాబుకు భద్రత గుర్తొస్తుంది
   ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్ లపై విజయసాయి మాటలదాడి

  ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్ లపై విజయసాయి మాటలదాడి

  వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తాజాగా సోమవారం ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్లలో లోకేష్ ను, చంద్రబాబును తిట్టిపోశారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లపై విమర్శలు కురిపించారు. దొంగలకిచ్చే నోబెల్ ప్రైజ్ ఏదైనా ఉంటే బాప్-బేటాలకు జాయింట్‌గా ఇవ్వాలని ఒక ట్వీట్ లో, లోకేష్ ఒకరకమైన జబ్బుతో బాధపడుతున్నాడంటూ మరో ట్వీట్ లో సెటైర్లు వేశారు.

  లోకేష్ ఒకరకమైన జబ్బుతో బాధపడుతున్నారన్న విజయసాయి

  లోకేష్ ఒకరకమైన జబ్బుతో బాధపడుతున్నారన్న విజయసాయి

  ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నందునే పవన విద్యుత్తును ఎక్కువ ధరకు కొన్నామంటూ చిట్టి నాయుడు మోకాలికీ బోడి గుండుకు ముడిపెడుతున్నాడని లోకేష్ పై విమర్శలు చేశారు . నదిని పూడ్చి ఇళ్లు కట్టుకుంటే తప్పేమిటని వాదిస్తారని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు . దొంగలకిచ్చే నోబెల్ ప్రైజ్ ఏదైనా ఉంటే బాప్-బేటాలకు జాయింట్‌గా ఇవ్వాలి. అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక లోకేష్ తమ సామర్థ్యాన్ని ఎక్కువగా ఊహించుకోవడం అనే వ్యాధితో బాధపడుతున్నాడని పేర్కొన్నారు . ఆ వ్యాధే అతనికి సమస్య గా మారిందంటూ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ఇక లోకేష్ కు ఉన్న వ్యాధిపై ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు తన పోస్ట్ లో .. దీనిని డన్నింగ్-క్రూగర్ ఎఫెక్ట్ అంటారని, లోకేశ్‌లో అభిజ్ఞా పక్షపాతం కూడా ఉందని ఎద్దేవా చేశారు. ‘‘తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు Cognitive Bias (అభిజ్ఞా పక్షపాతం)తో ఉంటారని సైకాలజీ చెబుతోందని సైకాలజీ పాఠం చెప్పారు . దీనిని Dunning-Kruger effect అని పిలుస్తారు. లోకేశ్ సమస్య కూడా ఇదే. తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం. ఒక్కడే సంతానం కావడం వల్ల ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు.'' అని లోకేష్ ని ఉద్దేశించి సెటైర్ వేశారు.

  రోగానికి చికిత్స చేయకుండా సపట్ మలాం పూసి చల్లగా జారుకున్న బాబు అని విజయసాయి సెటైర్లు

  రోగానికి చికిత్స చేయకుండా సపట్ మలాం పూసి చల్లగా జారుకున్న బాబు అని విజయసాయి సెటైర్లు

  చంద్రబాబు ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి కమీషన్ల కోసం ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించారని ఆరోపణలు గుప్పించారు . సహకార డెయిరీలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, ఏపీ జెన్కో, డిస్కమ్ లు అన్నీ దివాళా తీస్తుంటే రోగానికి చికిత్స చేయకుండా సపట్ మలాం పూసి చల్లగా జారుకున్నారని విజయసాయి మరో ట్వీట్ చేశారు. ఇక రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులు నిలిపివేసిన విషయంపై స్పందించిన విజయసాయి వరల్డ్ బ్యాంకు నిధులు నిలిపివేయడానికి కుంభకోణాలే కారణమని మండిపాటుకు గురయ్యారు . రియల్ ఎస్టేట్ కు మేలు చేసేలా ఉండటం, రుణం మంజూరు చేయకుండానే 92కిలోమీటర్ల రోడ్డుకు రూ.1872 కోట్లతో టెండర్ ఆమోదించడం పెద్ద కుంభకోణంగా వరల్డ్ బ్యాంకు దర్యాప్తులో వెల్లడైనట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మొత్తంగా దొంగలని, సైకలాజికల్ గా జబ్బుతో బాధ పడుతున్నారని విజయసాయి చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  English summary
  Vijayasai Reddy gets fired on Chandrababu and lokesh . Vijayasai Reddy is the leader of the YCP , MP and the representative to Jagan mohan Reddy . Vijay Sai Reddy taken Twitter as the venue for tweeting tweets against Chandrababu and tdp .YCP's general secretary Vijayasayara Reddy recently tweeted on Twitter that Lokesh and Chandrababu were thieves. In a tweet that would have given the thieves a Nobel Prize as a joint venture for the baap and beta Lokesh. He was tweeting in another tweet that lokesh is suffering with a psychological disease .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X