ఏపీలో ‘బంట్రోతు’ వ్యాఖ్యల దుమారం .. బాలయ్యకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి
ఏపీలో బంట్రోతు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎవరికి వారు బంట్రోతు వ్యాఖ్యలు చేస్తూ వాటికి కొత్త అర్ధాలు చెప్తున్నారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి బాలకృష్ణ బంట్రోతు వ్యాఖ్యలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలను ట్విట్టర్ వేదికగా ఎకిపారేస్తున్న విజయసాయిరెడ్డి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

బాలయ్య బంట్రోతు వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్
టీడీపీ అధినేతకు అచ్చెన్నాయుడు బంట్రోతు అన్న వ్యాఖ్యలపై బాలకృష్ణ అధికార పార్టీ నేతలు అయినా, ప్రతిపక్ష పార్టీ నేతలు అయినా ప్రజలకు బంట్రోతులేననీ, ప్రజా సేవకులేనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక బాలయ్య వ్యాఖ్యలకు అవును టీడీపీ నేతలంతా నిజమైన బంట్రోతులను బంట్రోతు అనే పదానికి కొత్త అర్ధం చెప్పారు విజయసాయి రెడ్డి . టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని బంట్రోతు అని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి విమర్శించడంపై బాలయ్య స్పందనకు కౌంటర్ వేసిన విజయ సాయి టీడీపీ ఎమ్మెల్యేలు అంతా ప్రజలకు బంట్రోతులేనని బాలయ్య భలే డైలాగ్ చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీడీపీ ఎమ్మెల్యేలు అంతా బంత్రోతులే అంటూ ఏకిపారేసిన విజయ సాయి రెడ్డి
ఇక గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలను ప్రస్తావిస్తూ మహిళా ఎమ్మార్వోను ఇసుకలో పడేసి కొట్టిన ఎమ్మెల్యే కూడా బంట్రోతేనని ఎద్దేవా చేశారు. ఇక ఆశా చెల్లెళ్లను బండబూతులు తిట్టిన వ్యక్తి కూడా సేవకుడనేనని విజయసాయి మండిపడ్డారు . ప్రజలను హింసించి వందలకోట్ల రూపాయలు ‘కె ట్యాక్స్' వసూలు చేసిన వారు స్పీకర్ గా చేసిన పెద్ద బంట్రోతు సంతానమే కదా! అని చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసి బంట్రోతు అన్న పదానికి కొత్త భాష్యం చెప్పారు . ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

చంద్రబాబు నాయుడ్ని ఎయిర్ పోర్ట్ లో తనిఖీ రాద్దాంతం పై ఘాటుగా స్పందించిన విజయ సాయి
గన్నవరం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని తనిఖీ చేయడంపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కూడా స్పందించిన ఆయన మీడియాలో వచ్చిన వార్తలపై , టీడీపీ నేతల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. "ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ గారిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు భద్రత ఎందుకు కల్పించలేదని అడగని పచ్చ మీడియా చంద్రబాబుకు ఏదో జరిగినట్టు శోకాలు పెడుతోంది. ఆయన కాన్వాయ్‌కి ట్రాఫిక్‌ను ఆపడం లేదట. ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట" అని ఆయన పేర్కొన్నారు ."ఒక బీసీ నాయకుడు స్పీకర్ అయితే గౌరవించాల్సిన అవసరం లేదనే మీ ఫిలాసఫీ అందరికీ తెల్సిందే చంద్రబాబూ గారూ. కిందటిసారి మీ కులపెద్ద సభాపతి అయితే తోడ్కొని వెళ్లారు. అప్పుడు మీరు పిలవకున్నా హుందాగా జగన్ గారు మీతో పాటు నడిచి ఆయనను అభినందించారు. మీకూ ఆయనకు తేడా అదే!" అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు .
-
వివేకా గుండెపోటు ప్లాన్ సునీతదే ! అవినాష్ రెడ్డి సంచలనం..! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications