విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ టీడీపీలో మరోసారి రచ్చ - చంద్రబాబు నిర్ణయంతో : నానికి ప్రయార్టీ- బుద్దా కు బుజ్జగింపు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం బెజవాడ లో మరోసారి విభేదాలకు కారణమైంది. పార్టీ అధినాయకత్వం తీరు పట్ల కొంత కాలంగా గుర్రుగా ఉన్న ఎంపీ కేశినేని నానిని బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాని కోరిన విధంగా బెజవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అప్పటికే అక్కడ బుద్దా వెంకన్న..నాగుల్ మీరా నియమించిన కమిటీల ను తప్పించారు. కొత్త కమిటీల ఏర్పాటుకు కేశినేని నానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ నిర్ణయం బెజవాడలో మరసారి టీడీపీలో అంతర్గత విభేదాలను బయట పెట్టింది.

కేశినేనికి పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు

కేశినేనికి పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు

పశ్చిమ నియోకవర్గంలో బాధ్యతలను కేశినేనికి అప్పగించటం పైన బుద్ధావెంకన్నా, నాగుల్‌ మీరా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అనుచర వర్గంతో భేటీ అయ్యారు. వారి అనుచరులు ఆందోళనకు దిగారు. తాము కేశినేని నాయకత్వంలో పని చేయమంటూ నినాదాలు చేసారు. పశ్చిమ నియోజకవర్గంతో పాటుగా బుద్దా క్యాంపు సామాజిక సమీకరణం బయటకు తీసుకొచ్చింది. తమ నియోజకవర్గానికి చెందిన బీసీ- ఎస్సీ- మైనార్టీ వర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసారు. దీంతో..వెంటనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది.

బుద్దా వెంకన్నను బుజ్జగించేందుకు

బుద్దా వెంకన్నను బుజ్జగించేందుకు

ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కార్యకలాపాలు, వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. ఈ కొత్త బాధ్యతల పైన బుద్దా అధికారికంగా స్పందించ లేదు. నగరంలో 2019 ఎన్నికల సమయం నుంచి పార్టీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ కేశినేని నాని కుమార్తెను మేయర్ అభ్యర్దిగా ప్రకటించటం పైనా ఈ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ సమయంలో ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ నేతలు తీరు మార్చుకోవాలని, లేకుంటే నష్టం తప్పదని చెబుతూనే...కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కొనసాగుతున్న టీడీపీ నేతల ఆధిపత్య పోరు

కొనసాగుతున్న టీడీపీ నేతల ఆధిపత్య పోరు


ఆ తరువాత కూడా కేశినేని నాని కొంత కాలం పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ కార్యాలయంలో కింది అంతస్తులో చంద్రబాబు పొటోలు తీసేసి... రతన్ టాటా తో తాను ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. ఒక దశలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ కేశినని తన మద్దతు దారులకు స్పష్టం చేసారు. ఇక, పార్టీ కార్యాలయం పైన వైసీపీ శ్రేణులు దాడికి నిరసనగా చంద్రబాబు పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. ఆ సమయంలో పార్టీ కార్యాలయానికి వెళ్లిన కేశినేని నాని ఏకాంతంగా చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆ సమయంలో సీఎం జగన్ పైన విమర్శలు చేసారు. ఇక, చంద్రబాబు రాష్ట్రపతి ని కలిసే సమయంలో నూ కేశినేని నాని కీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్నారు.

పరిష్కారం అవుతుందా..కొత్త సమస్యగా మారుతుందా

పరిష్కారం అవుతుందా..కొత్త సమస్యగా మారుతుందా

ఇప్పుడు కేశినేని వ్యతిరేక గ్రూపు అలక బూనింది. అయితే, పార్టీ అధినేత బుజ్జగింపుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలతో బుద్దా ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. ఇదే సమయంలో పలు నియోజకవర్గాలకు చంద్రబాబు పార్టీ ఇన్ ఛార్జ్ లను నియమించారు. మాచర్లకు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, విశాఖ జిల్లా దక్షిణానికి గండి బాబ్జీ ని ఖరారు చేసారు. అనంతపురం జల్లా మడకశిర పార్టీ నేతలు బల ప్రదర్శనకు దిగారు. ఈరన్న..తిప్పేస్వామి తన అనుచరులతో తమ బలం చాటుకొనే ప్రయత్నం చేసారు. ఇక, చిత్తూరు జిల్లా తంబళపల్లి నియోజకవర్గం పైనా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు పార్టీకి చేస్తున్న కాయ కల్ప చికిత్స కొత్త సమస్యలకు కారణం అవుతోంది. మరి..వీటిని చంద్రబాబు ఏ విధంగా ఎడ్జస్ట్ చేస్తారో చూడాలి.

English summary
The latest decision taken by the TDP chief has once again caused controversy between Vijayawada party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X