విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయేషా కేసుల్లో కొత్త ట్విస్ట్ : ముగ్గురు పోలీసు క‌మిష‌నర్ల విచార‌ణ : సిబిఐ షాకింగ్ నిర్ణ‌యం..!

|
Google Oneindia TeluguNews

దాదాపు 12 ఏళ్లుగా సాగుతున్న ఆయేషా మీరా హ‌త్య కేసులో సిబిఐ కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటోంది. కోర్టు ఆదేశాల మేర‌కు విచార‌ణ ప్రారంభించిన సిబిఐ ఈ కేసులో తొలి నుండి అనేక అంశాల పై దృష్టి పెట్టింది. రికార్డులు లేక‌పోవ టం పై కోర్టు సిబ్బంది పై కేసులు న‌మోదు చేసిన సిబిఐ..ఇప్పుడు ఆ స‌మ‌యంలో విజ‌య‌వాడ న‌గ‌రంలో విధులు నిర్వ‌హంచిన పోలీసు సిబ్బంది తో పాటుగా క‌మిష‌నర్ల‌ను విచారించాల‌ని నిర్ణ‌యించింది.

సంచ‌ల‌నం సృష్టించిన హ‌త్య కేసు..
కృష్ణాజిల్లా విజయవాడలోని ఇంబ్రహీంపట్నం హాస్టల్‌లో 2007 డిసెంబర్‌లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్యంబాబును 2008 ఆగస్టు 17న నిందితుడిగా అరెస్టు చేశారు. సెల్‌ఫోన్‌ దొంగతనం కేసులో సత్యంబాబు పట్టుబడటంతో అతడిని.. ఆయేషా హత్య కేసులో నిందితుడిగా చూపించారనే ఆరోప ణలు వచ్చాయి. హత్య కేసును విచారించిన విజయవాడ మహిళా కోర్టు 2010 సెప్టెంబర్‌ 29న సత్యంబాబును దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. దీంతో సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా, అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ గత ఏడాది మార్చి 31న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆ త‌రువాత రాష్ట్ర ప్ర‌భుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ చేతులెత్తేయ‌టంతో కోర్టు ఈ కేసును సిబిఐకి అప్ప‌గించింది. విచార‌ణ ప్రారంభించిన సిబిఐ హ‌త్య జ‌రిగిన నాటి నుండి కేసు పూర్వాప‌రాల పై ఆధారాలు..స‌మాచారం సేక‌రిస్తోంది.

CBI likely to Investigate Police officers in Ayesha Meera case..

క‌మిష‌నర్లు..ఏసీపిల విచార‌ణ కు నిర్ణ‌యం..
అనేక మ‌లుపులు తిరిగిన ఆయేషా మీరా హ‌త్య కేసులో సిబిఐ లోతుగా విచార‌ణ సాగిస్తోంది. కేసుకు సంబంధించిన ప్రాధమిక ఆధారాల పై దృష్టి పెట్టింది. కోర్టు ఆదేశాల మేర‌కు రంగంలో దిగిన సిబిఐ ఇప్ప‌టికే ప‌లువురిని విచారించిం ది. ఈ క్ర‌మంలో ఆయేషా మీరా కేసును తొలుత ద‌ర్యాప్తు చేసిన పోలీసుల‌ను ప్ర‌శ్నించేందుకు సిద్ద‌మైంది. ఇందులో భాగంగా ఇందులో భాగంగా అప్పటి కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సహా, ఈ కేసులో ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ను సీబీఐ విచారించనుంది. వీరితో సహా ముగ్గురు కమిషనర్లు, ముగ్గురు ఏసీపీలు, తొమ్మిది మంది కానిస్టేబుళ్లపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఈ కేసులో వీరిని విచారించ‌టం ద్వారా నాడు విచార‌ణ జ‌రిగిన తీరు.. సాక్షుల స్టేట్‌మెంట్లు..కేసులో వ‌చ్చిన ఆరోప‌ణ‌ల పై సిబిఐ ప్ర‌ధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పు డు సిబిఐ దూకుడు తో ఈ కేసు ఎటువంటి మ‌లుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ ఏర్ప‌డింది.

English summary
CBI decided to investigate police officers in Ayesha Meera Murder case. With High Court orders cbi started investigation in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X