భయానకం: సింగ్ నగర్‌ను వరద ముంచెత్తిందిలా: షాకింగ్ వీడియో

Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో వరుసగా కుంభవృష్టి తరహా పరిస్థితులు సంభవించాయి. మొన్నటివరకు భారీ వర్షాలు దంచికొట్టాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాలను ముంచివేశాయి. ప్రత్యేకించి- రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. కొన్ని రోజులపాటు బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగింది. ప్రస్తుతం దీని తీవ్రత భారీగా తగ్గింది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు కోలుకున్నాయి. సింగ్‌నగర్‌, చిట్టినగర్‌, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాల్లో వరదనీరు పూర్తిగా తగ్గింది.

CCTV footage captured Singh Nagar in Vijayawada witness the rise in flood water on September 1

అదే సమయంలో సహాయక, పునరావాస చర్యలు ముమ్మరం సాగుతున్నాయి ఆయా ప్రాంతాల్లో. అధికార యంత్రాంగం అక్కడే మకాం వేసింది. చిట్టచివరి వ్యక్తి వరకూ సహయక చర్యలు అందేలా చేస్తోంది. అధికార తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమవంతు సహాయక చర్యలను అందిస్తోన్నారు.

విజయవాడ మునిగిపోవడానికి ప్రధాన కారణం- బుడమేరు. వరద ప్రవాహాన్ని ఇందులోకి మళ్లించడం వల్లే విజయవాడ ఈ దుస్థితికి చేరిందనే అభిప్రాయాలు ఉన్నాయి. బుడమేరుకు భారీగా గండ్లు పడటం, వరద ప్రవాహం మొత్తం జనావాసాల్లోకి ప్రవహించడానికి కారణం అయింది.

CCTV footage captured Singh Nagar in Vijayawada witness the rise in flood water on September 1

బుడమేరు వరద ప్రవాహం సింగ్‌నగర్‌ను ఎలా చుట్టుముట్టిందనేది అక్కడ అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డయింది. సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం నమోదైన దృశ్యాలు అవి. ప్రారంభంలో ఒక అడుగు కింద వరకే కనిపించిన వరద నీరు మూడు గంటల వ్యవధిలో సుమారు అయిదు అడుగులకు మించి ప్రవహించడం ఈ వీడియోలో చూడొచ్చు.

విజయవాడ వరదల్లో అధికంగా దెబ్బతిన్న ప్రాంతం ఇదే. ఈ నెల 1వ తేదీన వరద ముంచెత్తగా.. ఈ రోజు వరకు కూడా అక్కడ సుమారు రెండడుగుల మేర నీళ్లు అలాగే ఉండిపోయాయి. వందలాది నివాసాల్లో బురద పేరుకుపోయింది. వరద ప్రవాహం తగ్గినా నివాసాలకు వెళ్లలేని దుస్థితిని చవి చూస్తోన్నారు సింగ్ నగర్ వాసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+