విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న పై ఆంక్ష‌లు : కేంద్రం..ఎందుకిలా..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Central Govt Restriction On Chandrababu Davos Tour | Oneindia Telugu

కేంద్రం తీసుకున్న మ‌రో నిర్ణ‌యం ఇప్పుడు టిడిపికి అస్త్రంగా మారుతోంది. ప్ర‌తీ ఏడాది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తూ ఉంటారు. ఆయ‌న తో పాటుగా కొంద‌రు మంత్రులు..అధికారులు వెళ్ల‌టం సాధర‌ణ అంశంగా మారింది. అయితే, ఎప్పుడూ లేని విధంగా..ఈ సారి చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న పై కేంద్రం ఆంక్ష‌లు విధించింది.

ప్ర‌పంచ ఆర్దిక స‌ద‌స్స‌కు చంద్ర‌బాబు

ప్ర‌పంచ ఆర్దిక స‌ద‌స్స‌కు చంద్ర‌బాబు

ఏపికి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌టానికి ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌తీ ఏటా దావోస్ లో జరిగే ప్ర‌పంచ ఆర్దిక స‌ద‌స్స‌కు హాజ‌రవుతూ ఉంటారు. ఈ ఏడాది కూడా అదే విధంగా హాజ‌ర‌య్యేందుకు ముఖ్య‌మంత్రి సిద్ద‌మ‌య్యారు. ఈ సారి ముఖ్య‌మంత్రితో పాటుగా ఆర్దిక‌, ఐటి మంత్రులు సైతం హాజ‌రు కావాల‌ని నిర్ణ‌యించుకున్నారు.
ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి ప్ర‌పంచ ఆర్దిక స‌ద‌స్సు నిర్వాహ‌కుల‌కు స‌మాచారం అందించారు. ఇదే విష‌యాన్ని కేంద్రానికి సైతం నివేదించి అనుమ‌తి కోరారు.

ఎందుకీ ఆంక్ష‌లు..

ఎందుకీ ఆంక్ష‌లు..

ముఖ్య‌మంత్రి బృందం ఏడు రోజుల పాటు దావోస్ లో ప‌ర్య‌టించాల‌ని భావించ‌గా .. కేంద్రం దీనిని కుదిస్తూ నాలుగు రోజుల‌కే పరిమితం చేసుకోవాల‌ని సూచించింది. అదే విధంగా..ముఖ్య‌మంత్రి బృందం లో 14 మంది స‌భ్యులు దావోస్ వెళ్లాల‌ని అనుమ‌తి కోర‌గా..కేవ‌లం న‌లుగురికే అనుమ‌తి ఇస్తూ రాష్ట్ర ప్ర‌భు త్వానికి స‌మాచారం అందించింది. దీంతో..ఇప్పుడు ముఖ్య‌మంత్రి కేంద్రం తీరు పై పైర్ అవ‌తున్నారు. త‌మ ప‌ర్య‌ట న అవ‌స‌రాన్ని వివ‌రిస్తూ మ‌రో సారి కేంద్రానికి లేఖ రాయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

చంద్ర‌బాబుకు చేతికి మ‌రో అస్త్రం..!

చంద్ర‌బాబుకు చేతికి మ‌రో అస్త్రం..!

ముఖ్య‌మంత్రి బృందం దావోస్ ప‌ర్య‌ట‌న పై కేంద్రం ఆంక్ష‌లు విధించ‌టంతో చంద్ర‌బాబు చేతికి కేంద్రం మ‌రో అస్త్రం ఇచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. దావోస్ ప‌ర్య‌ట‌న ద్వారా వివిధ దేశాల‌కు చెందిన వ్యాపార‌-వాణిజ్య ప్ర‌ముఖుల‌తో సీయం స మావేశం కావాల‌ని నిర్ణ‌యించారు. అదే విధంగా ప్ర‌ధానంగా ఏపికి పెట్టుబ‌డుల కోసం ముఖ్య‌మంత్రి ఈ ప‌ర్య‌ట‌న‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని భావిస్తున్నారు.

కేంద్ర విదేశాంగ శాఖ అనుమ‌తుల‌ను కుదిస్తూ తీసుకున్న నిర్ణ‌యం తో ఇప్పుడు సీయం సీరియ‌స్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కేంద్రం తీరు పై ముఖ్య‌మంత్రి ప్ర‌తీ సంద‌ర్బంలోనూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, ఏపికి పెట్టుబ‌డుల‌ను ఆకర్షించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను కేంద్రం అడ్డుకుం టోంద‌ని సీయం అస‌హ‌నంతో ఉన్నారు. ఇక‌, దావోస్ లాంటి స‌ద‌స్సుల‌కు హాజ‌రు అవ్వ‌కుండా ఆంక్ష‌లు ఏంట‌ని టిడిపి నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి..కేంద్రం దీని పై అధికారికంగా ఎలా స్పందిస్తుందో చూడాలి..

English summary
Foreign Affairs ministry restricted Chandra Babu Dawoos Tour. Miistry of foreign affairs informed state govt to limit C.M tour for four days..and team for seven members. C.M serious on Central Govt decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X