జగన్ లా కాదు చంద్రబాబు ధర్నాలు పబ్లిసిటీ కోసమే : వైసీపీ నేతలు సజ్జల, బొత్సా ఫైర్
అనుమతి లేకుండా వెళ్లి, రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు వైసిపి నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టిడిపి నేతలను బెదిరించవలసిన అవసరం తమకు లేదని, టిడిపి ఉనికి కోసం చంద్రబాబునాయుడు పాకులాడుతున్నారని, అందులో భాగంగానే ఇంత సీన్ చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

తిరుపతికి వెళ్లి చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు
ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ధర్నా చేయకూడదని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు .
అనుమతి లేకుండా తిరుపతికి వెళ్లి చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఆందోళన చేశారని, అదే నిజమైన ధర్నా అని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ధర్నాలు కేవలం పబ్లిసిటీ కోసమే అని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుందని, పంచాయతీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉన్న పార్టీ.. అభ్యర్థులు దొరక్క అభాండాలు
పార్టీ గుర్తుపై పోటీ చేసే ఈ ఎన్నికల్లో పాజిటివ్ ఓటుబ్యాంకు మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉన్న పార్టీ అని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు అభ్యర్థులు దొరకక తమపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే చంద్రబాబు మాత్రం దౌర్జన్యాలు జరిగాయంటున్నారని పేర్కొన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు తన పార్టీ పరిస్థితి పై ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ నేతలను బెదిరించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.

చంద్రబాబుపై బొత్సా ఫైర్ .. మళ్ళీ పంచాయతీ ఎన్నికల ఫలితాలే రిపీట్
అనంతపురం జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశమయ్యేందుకు వెళ్లిన జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు మున్సిపల్ ఎన్నికలలో వస్తాయని, జగన్ పాలన నుంచి ప్రజలు పంచాయతీ ఎన్నికలలో 90 శాతం సీట్లు ఇచ్చారని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయి అని పేర్కొన్నారు. మోసం చేయడం చంద్రబాబు నాయుడు నైజం అన్న మంత్రి బొత్స సత్యనారాయణ రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు ధర్నా డ్రామాపై మండిపడ్డారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications