టీడీపీ నేతల గృహ నిర్బంధంపై చంద్రబాబు ఫైర్ .. పోలీసులు తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం

ఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులు 21 రోజులుగా కొనసాగిస్తున్న ఆందోళనలో భాగంగా నేడు జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు . ఈ నేపధ్యంలో పోలీసులు జాతీయ రహదారుల దిగ్బంధనానికి అనుమతి నిరాకరించి ఎక్కడి వారిని అక్కడే అరెస్ట్ చేశారు . రైతుల పోరాటానికి మద్దతు తెలపటానికి వెళ్లాలని ప్రయత్నించిన టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ ల నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ రహదారి దిగ్భంధన భగ్నం ... టీడీపీ నేతల అరెస్ట్ లు, హౌస్ అరెస్ట్ లు

రాజధాని ఆందోళనల నేపధ్యంలో రాజధాని అమరావతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజాగా గుంటూరు చినకాకాని దగ్గర జాతీయ రహదారి దిగ్భంధం కార్యక్రమానికి అమరావతి జేఏసీ పిలుపునివ్వటంతో టీడీపీ నేతలు రైతులతో పాటు జాతీయ రహదారుల దిగ్బంధనానికి ప్రయత్నం చేస్తారని భావించిన పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ను ఆయనతో పాటు నిమ్మల రామా నాయుడు, గద్దె రామ్మోహన్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ నేతల అరెస్ట్ లు, హౌస్ అరెస్ట్ లను ఖండించిన చంద్రబాబు

టీడీపీ నేతల అరెస్ట్ లు, హౌస్ అరెస్ట్ లను ఖండించిన చంద్రబాబు

జాతీయ రహదారుల దిగ్బంధనం నేపధ్యంలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతల అరెస్ట్ లు, హౌస్ అరెస్ట్ లను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇది అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు.రాజధాని కోసం వేలాది కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా పట్టింపు లేనట్టు ప్రభుత్వం ప్రవర్తించటం దారుణం అన్నారు. రైతులు, రైతుకూలీలకు మద్దతు చెప్పేందుకు వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని , అన్యాయమని ఆయన మండిపడ్డారు .

పోలీసు బలగాలతో ప్రజాభీష్టాన్ని కాలరాయలేరని ఫైర్

పోలీసు బలగాలతో ప్రజాభీష్టాన్ని కాలరాయలేరని ఫైర్

పోలీసు బలగాలతో ప్రజాభీష్టాన్ని కాలరాయలేరన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం అణచివేతలకు పాల్పడుతుందని ఆయన ఫైర్ అయ్యారు. వందలాది టీడీపీ నేతల అక్రమ నిర్బంధం వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పోకడలకు పరాకాష్ట అని చంద్రబాబు భగ్గుమన్నారు . రైతులు, మహిళలు, రైతు కూలీలపై అక్రమ కేసులు పెట్టడం దారుణం అని ఆయన పేర్కొన్నారు . అరెస్ట్ చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని పేర్కొన్న చంద్రబాబుఅక్రమ కేసులు ఎత్తేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హౌస్ అరెస్ట్ పై ఫైర్ అయిన బొండా ఉమా .. ప్రైవేట్ కేసు వేస్తాం

హౌస్ అరెస్ట్ పై ఫైర్ అయిన బొండా ఉమా .. ప్రైవేట్ కేసు వేస్తాం

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై ఉమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు తెలపడానికి వెళ్లడం తప్పా? అని ప్రశ్నించారు. పోలీసులు ఇంటి తలుపులు మూయడాన్ని ఆక్షేపించారు.అనుమతి లేకుండా పోలీసులు ఇంట్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ప్రైవేటు కేసులు వేసి, న్యాయస్థానంలో పోరాటం చేస్తానన్నారు.

అరెస్ట్‌లు, జైళ్లకు భయపడేది లేదన్న టీడీపీ నేతలు


టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై మండిపడిన ఆయన అరెస్ట్‌లు, జైళ్లకు భయపడేది లేదని రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. ఇక కేశినేని నానీ, దేవినేని ఉనా, నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్, గల్లా జయ దేవ్ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజధానిగా అమరావతి కొనసాగించాలని ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+