జగన్ టార్గెట్ వారే: ఉన్మాది అన్నా తప్పేంటి అంటూ చంద్రబాబు ఏకిపారేశారు

అమరావతి: ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.

బెదిరించే రీతిలో.. వారే జగన్ టార్గెట్

బెదిరించే రీతిలో.. వారే జగన్ టార్గెట్

అధికారులను బెదిరించే రీతిలో ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం దృష్టి సారించాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎంకు చెందిన జగతి సంస్థ అక్రమాలు వెలికితీసినందుకే ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ను సస్పెన్షన్‌ విధించి వేధిస్తున్నారని ఆరోపించారు. అసెస్మెంట్ బృందంలో ఉండటమే కృష్ణకిషోర్ చేసిన నేరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారిని సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కేసులు పెట్టిన వాళ్లను జగన్ టార్గెట్ చేస్తున్నారని, ఈ చర్యలతో విచారణ జరుగుతున్న ఆయన కేసులపై ప్రభావం ఉంటుందన్నారు.

సహ నిందితులే సలహాదారులుగా..

సహ నిందితులే సలహాదారులుగా..

తాను అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు వైసీపీ నేతలపై మండిపడ్డారు. ప్రజాప్రతినిధులమైన తమను శాసనసభలోపలికి రాకుండా గేటు వద్ద అడ్డుకోవడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. జైలులో వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు ఉన్నవారికి ఇప్పుడు పెద్ద పదువులు కట్టబెట్టారని, సహా నిందితులుగా ఉన్నవారిని సలహాదారులుగా పెట్టుకున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఉన్మాది అన్నా.. తప్పేంటి?

ఉన్మాది అన్నా.. తప్పేంటి?

ప్రభుత్వ ఉద్యోగులను ఎప్పుడూ తాము దూషించలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతను అడ్డుకునే అధికారం చీఫ్ మార్షల్ కు ఉందా? అని ప్రశ్నించారు. ఉద్యోగులు రాజకీయ వ్యవహారాల్లోకి రావొద్దని అన్నారు. ‘మీరు ఏ తప్పు చేసినా మేం మాట్లాడకూడదా? మీ పనులు ఉన్మాదిలా ఉన్నాయని అన్నా.. దానిలో తప్పేముంది? ఉన్మాది అనడం అన్ పార్లమెంటరీ పదం కాదు. సీఎం నోటికి వచ్చినట్లు అసత్యలు చెబుతున్నారు. సీఎం వైఖరి కేంద్రం కూడా పరిశీలించాలి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

నోటితో చెప్పలేని..

నోటితో చెప్పలేని..

ప్రతిపక్ష నేతను దెబ్బతీయడమే జగన్ పార్టీ నేతల టార్గెట్ అని అన్నారు. భయపడితే తాము లొంగిపోతామని అనుకుంటున్నారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నోటితో చెప్పలేని వ్యక్తిగత దూషణలు దిగుతున్నారని మండిపడ్డారు.

కక్ష సాధించేందుకేనా?

కక్ష సాధించేందుకేనా?


శాసనసభ పవిత్రతను చెడగొడుతున్నారని, శాసనసభకు, వాయిదా తీర్మానాలకు విలువ లేకుండా చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తారని ప్రజలు అధికారం ఇస్తే.. తనపై కక్ష సాధిస్తున్నారని దుయ్యబట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఏం చేస్తున్నారో అందరికీ తెలుసని.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఎవరికి చెల్లింపులు చేశారో చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+