విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణాజిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ ప్రారంభం- గుజరాత్‌, పంజాబ్‌, అస్సాంలోనూ

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్యసిబ్బంది, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డ్రై రన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ, గుజరాత్‌, పంజాబ్‌, అసోంలో ఇవాళ డ్రైరన్ ప్రారంభమైంది. ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉదయం ఈ డ్రై రన్ ప్రారంభమైంది. రెండు రోజుల పాటు సాగే ఈ డ్రై రన్‌ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. విజయవాడతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఐదు కేంద్రాల్లో ఇది సాగుతోంది.

Recommended Video

కృష్ణాజిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ జరిగిందిలా..!

రిపబ్లిక్‌ డే ఏర్పాట్లలో కలకలం- పరేడ్‌ కోసం వచ్చిన 150 మంది సైనికులకు కరోనా ? ఈ సారి రిపబ్లిక్‌ డే వేడుకలపై కరిపబ్లిక్‌ డే ఏర్పాట్లలో కలకలం- పరేడ్‌ కోసం వచ్చిన 150 మంది సైనికులకు కరోనా ? ఈ సారి రిపబ్లిక్‌ డే వేడుకలపై క

కృష్ణాజిల్లాలో కరోనా డ్రై రన్

కృష్ణాజిల్లాలో కరోనా డ్రై రన్

ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్ డ్రై రన్‌ కోసం ఎంపిక చేసిన కృష్ణాజిల్లాలో ఉదయం 9 గంటలకు ఇది టీకా ప్రయోగం ప్రారంభమైంది. విజయవాడలోని ప్రభుత్వాసుపత్రితో పాటు తాడిగడప కృష్ణవేణి డిగ్రీ కాలేజ్, ప్రకాష్‌ నగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రం, పూర్ణ ఇన్‌సిట్యూట్‌, ఉప్పులూరు పీహెచ్‌సీల్లో అధికారులు వ్యాక్సినేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఐదు చోట్ల గట్టి భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ సవ్యంగా సాగితే భవిష్యత్తులో వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అవసరమైన అవగాహన కల్పించినట్లు అవుతుందని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ చెప్పారు.


వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

 వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ సాగేది ఇలా...

వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ సాగేది ఇలా...


వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారిని గైడ్ చేసేందుకు మహిళా పోలీసులతో పాటు ఇతర సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ప్రతీ వ్యాక్సినేషన్‌ కేంద్రంలోనూ మూడేసి గదులు ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ కేంద్రం లోపలికి వెళ్లగానే మొదటిగదిలో రిజిస్ట్రేషన్‌, రెండో గదిలో వ్యాక్సినేషన్‌, మూడో గదిలో అబ్జర్వేషన్‌ ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ కోసం పేరు నమోదు చేయించుకోవడం, వ్యాక్సిన్ తీసుకోవడం, తీసుకున్నాక ఏమైన ఇబ్బందులు ఉన్నాయా అనేది పరిశీలన చేసి పంపించేస్తారు. స్ధానికంగా ఉన్న ప్రజలను ఈ డ్రై రన్‌లో భాగస్వాముల్ని చేస్తున్నారు. వ్యాక్సిన్‌ విషయంలో ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించడమే లక్ష్యంగా ఈ డ్రై రన్ సాగుతోందని అధికారులు చెప్తున్నారు.

 గుజరాత్‌, పంజాబ్‌, అస్సాంలోనూ..

గుజరాత్‌, పంజాబ్‌, అస్సాంలోనూ..


కరోనా వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ఈ డ్రై రన్‌ జరుగుతోంది. ఇందులో ఏపీతో పాటు గుజరాత్‌, పంజాబ్‌, అస్సాం కూడా ఉన్నాయి. ఏపీలో కేవలం ఒక జిల్లా మాత్రమే తీసుకోగా.. మిగతా రాష్ట్రాల్లో రెండేసి జిల్లాల్లో ఈ డ్రై రన్‌ సాగుతోంది. ప్రతీ జిల్లాలో 100 డోసుల డమ్మీ వ్యాక్సిన్‌ను కేంద్రం పంపింది. వ్యాక్సిన్ నిల్వ చేసిన డిపోల నుంచి ఇది వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లే వరకూ ఈ డోసుల ఉష్ణోగ్రతను సైతం రికార్డు చేస్తారు. వ్యాక్సిన్‌ తీసుకునే వారికి ముందుగానే వ్యాక్సిన్‌ వేసే వారి పేరు, వ్యాక్సిన్‌ వేసే సమయానికి సంబంధించిన ఎస్సెమ్మెస్‌ పంపిస్తారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అరగంటపాటు ప్రతీ బాధితుడూ అక్కడే పరిశీలనలో ఉండాలి. ఆ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా సెంట్రల్‌ సర్వర్‌కు సమాచారం పంపుతారు.

English summary
as per the central government's guidelines, covid 19 vaccination dry run begins in krishna district of andhra pradesh today. it will last for two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X