విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్ ది మూడు ముక్కలాట .. అమరావతి రాజధానిగా కొనసాగించకుంటే రాజీనామా చెయ్ : సీపీఐ నారాయణ

|
Google Oneindia TeluguNews

మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సిపిఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి మార్పు నిర్ణయం తీసుకుంటే సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఏపీలో జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని నారాయణ మండిపడ్డారు.

రాజధాని మార్చే హక్కు జగన్‌కు లేదన్న నారాయణ

రాజధాని మార్చే హక్కు జగన్‌కు లేదన్న నారాయణ

రాజధాని మార్పుపై సీపీఐ నారాయణ జగన్‌పై నిప్పులు చెరిగారు . ఏపీని నవ్వులపాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్‌కు చిత్తశుద్ది ఉంటే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని మార్చే హక్కు జగన్‌కు లేదన్న నారాయణ జగన్ మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలతో ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బోస్టన్ కమీటీ నివేదిక మెంటల్ ఆసుపత్రి

బోస్టన్ కమీటీ నివేదిక మెంటల్ ఆసుపత్రి

పదేపదే ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ మంత్రులు , ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అమరావతి భూములను సెజ్‌లుగా మార్చేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు . బోస్టన్ కమీటీ నివేదిక మెంటల్ ఆసుపత్రిలో రూపొందించినట్టు తలపిస్తుందన్నారు నారాయణ . ఏపీ సర్కార్ వేసిన బోగస్ కమీటీలు ఇచ్చిన నివేదికలతో రాష్ట్రాన్ని విచ్చిన్నం చేస్తున్నారన్నారు. అమరావతి శాపమై జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది అని నారాయణ పేర్కొన్నారు .

జగన్ పిచ్చి తుగ్లక్ లా పాలన చేస్తున్నాడని నారాయణ ఫైర్

జగన్ పిచ్చి తుగ్లక్ లా పాలన చేస్తున్నాడని నారాయణ ఫైర్

జగన్ పిచ్చి తుగ్లక్ లాగా పాలన చేస్తున్నాడని నారాయణ అన్నారు. కేవలం చంద్రబాబుపై కక్షతో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ భార్యభర్తల సంబందం లాంటిది వాటిని విడదీయకూడదు అని జగన్ కు నారాయణ హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అటు ఉద్యోగులకు తలనొప్పిగా మారిందని ఆయన పేర్కొన్నారు .ఐఎఎస్ అధికారులు కుటుంబాల్లో రాజధానులు పేరుతో గొడవలు సృష్టిస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు .

English summary
CPI leader Narayana expressed outrage over AP CM Jagan. Narayana said CPI was committed to Amaravati as capital. Narayana believes that the committees are made from mental hospital . the reports has no value. Narayana claimed that Amaravathi curses the Jagan government.He demanded resignation and see how referendum would be held if Amaravati did not remain the capital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X