Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్వామినీ వ‌ద‌ల్లేదు: జ‌గ‌న్‌కు సూచ‌న చేసారు..నోటీసులు అందుకున్నారు: బీజేపీ నేత‌ల‌కు సైతం..!

క‌ర‌క‌ట్ట పంచాయితీ కొన‌సాగుతూనే ఉంది. క‌ర‌క‌ట్ట మీద నిర్మాణాలు ఉన్న ఎవ‌రినీ సీఆర్డీఏ అధికారులు వ‌ద‌ల‌టం లేదు. అందులో శైవక్షేత్రం నిర్వ‌హిస్తున్న పీఠాధిప‌తి శివస్వామినీ అధికారులు విడిచిపెట్ట‌లేదు. ఆయ‌న‌దీ అక్ర‌మ నిర్మాణ‌మే అంటూ నోటీసులు ఇచ్చారు. చంద్ర‌బాబు ప్ర‌జా వ్య‌తిరేక పాల‌తోనే ఓట‌మి పాల‌య్యార‌ని నాలుగు రోజుల క్రితం శివ‌స్వామి తిరుల‌లో వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో ప్రజామోదం క‌లిగేలా పాల‌న చేయాలంటూ జ‌గ‌న్‌కు సూచ‌న చేసారు. అంతే ఇప్పుడు నోటీసులు వ‌చ్చేసాయి. ఇక‌, బీజేపీ ప్ర‌ముఖ‌ల‌కు సీఆర్డీఏ నోటీసులు ఇచ్చింది. ఇది ఎటు ట‌ర్న్ తిరుగుతుందో.. ఏ ప‌రిణామాల‌కు కార‌ణం అవుతుందో అనే ఉత్కంఠ మొద‌లైంది..

శివ స్వామీ ఏంటీ త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం...

శివ స్వామీ ఏంటీ త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం...

కృష్ణా క‌ర‌క‌ట్ట స‌మీపంలో తాళ్లాయ‌పాలెం వ‌ద్ద ఉన్న శైవక్షేత్రం ఎంతో ప్ర‌సిద్ది చెందిన‌ది. ఎంతో మంది భ‌క్తులు అక్క‌డ శివ స్వామీ అశీస్సుల కోసం వ‌స్తూ ఉంటారు. తాజాగా క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మ నిర్మాణాలు..నిబంధ‌న‌లు ఉల్లంఘించి అదే ప్రాంతంలోని నిర్మాణాల పైన ప్ర‌భుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా శైవ‌క్షేత్ర పీఠానికి తాజాగా సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. వారం లోగా నిర్మాణాల‌ను తొలిగించే అంశం పైన స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని పేర్కొంది. నాలుగు రోజుల క్రిత‌మే శివ స్వామి తిరుమ‌ల వెళ్లారు. అక్క‌డ నూత‌న ముఖ్య‌మంత్రికి జ‌గ‌న్‌కు సూచ‌న చేసారు. ప్రజావ్యతిరేక పాలన సాగించడం వల్లే చంద్రబాబు ఓడిపోయారని అన్నారు. ప్రజామోదం కలిగేలా పాలన చేస్తే మోడీలా జగన్ కూడా విజయం సాధిస్తారని, ప్రజావ్యతిరేక పాలన సాగిస్తే చంద్రబాబులా ఓటమి పాలవుతారని శివస్వామి అన్నారు. అంతే నాలుగు రోజుల‌కే ఇప్పుడు నోటీసు అందుకున్నారు. దీని మీద స్వామి ఏ ర‌కంగా స్పందిస్తారో చూడాలి.

బీజేపీ నేత‌ల‌కు నోటీసులు..

బీజేపీ నేత‌ల‌కు నోటీసులు..

క‌ర‌క‌ట్ట మీద పెద్ద అతిధి గృహాలు నిర్మించుకున్న బీజేపీ మాజీ ఎంపీ..క‌మ‌లం పార్టీ అధినాయ‌క‌త్వానికి అత్యంత సన్నిహితంగా ఉండే నేత‌ల‌కూ సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. అందులో మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు ఉన్నారు.
ఆయ‌న గెస్ట్ హౌస్ న‌దీగ‌ర్బంలోకి ఉంటుంది. ఆయ‌న బీజేపీ నేత‌ల ద్వారా జ‌గ‌న్ పైన ఒత్తిడి తెస్తారా..లేక ఇక్క‌డే త‌న స‌మ‌స్య ప‌రిష్క‌రించుకుంటారా అనేది చూడాలి. ఆయ‌న‌తో పాటుగా..బచందనా బ్రదర్స్‌, పాతూరు సుధారాణి సహా మరో ఆరుగురికి సీఆర్డీఏ నోటీసులు పంపింది. తాజాగా నాదెండ్ల వేణుకు చెందిన గెస్ట్‌ హౌస్‌కు నోటీసులు ఇచ్చిన సీఆర్డీఏ.. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక‌, అక్క‌డే గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద ఆశ్ర‌మం ఉంది. దీనికి అనుమ‌తి ఉంద‌ని ఆశ్ర‌మ నిర్వ‌హ‌కులు చెబుతున్నారు. అనుమ‌తి ఎవ‌రు ఇచ్చార‌నే దాని పైన సీఆర్డీఏ అధికారులు స‌మాచారం సేక‌రిస్తున్నారు. వారం క్రితం ఇదే ఆశ్ర‌మంలో విశాఖ శార‌దా పీఠాధిప‌తి నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు కేసీఆర్..జ‌గ‌న్ హాజ‌రయ్యారు.

ముందడుగానే...ఇమేజా..డామేజా..

ముందడుగానే...ఇమేజా..డామేజా..

ఏపీ సీఎం జ‌గ‌న్ రాజ‌ధానిలోని క‌ర‌క‌ట్ట మీద అక్ర‌మ నిర్మాణాల వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా ప్ర‌జావేదిక‌ను కూల్చేసిన ప్ర‌భుత్వం..ఇప్పుడు మిగిలిన భ‌వ‌నాల‌కు నోటీసులు జారీ చేస్తోంది. వారం రోజులు స‌మ‌యం ఇస్తున్న‌ట్లు అందులో స్ప‌స్టం చేసింది. దీని ద్వారా చంద్ర‌బాబు విష‌యంలో తాను క‌క్ష్య సాధింపులో భాగంగా కాకుండా..అంద‌రి విష‌యంలోనూ ఒకే ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాన‌నే సంకేతాలు ఇవ్వ‌టానికి జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, జ‌గ‌న్ కోరుకుంటున్నట్లుగా ఈ క‌ర‌క‌ట్ట నిర్మాణాల‌ను తొలిగించ‌టం సాధ్య‌మ‌య్యే ప‌నేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాజ‌ధానిలో అవినీతి అంటూ..ఇప్పుడు అక్ర‌మ నిర్మాణాలు అంటూ చెప్ప‌టం ..రాజ‌దానిలో నిర్మాణాల‌ను తాత్కాలికంగా ఆపటం ద్వారా జ‌గ‌న్ ను టీడీపీ టార్గెట్ చేసే అవ‌కాశం ఉంది. అయితే, జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు సీఎం ఇమేజ్‌ను పెంచుతాయా..లేక డామేజ్ చేస్తాయా అనేది వేచి చూడాల్సిందే..

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+