స్మశాన వాటికలో శవాలు క్యూలో .. ప్రశ్నిస్తున్నాననే కక్షతోనే నాపై ఇలా : దేవినేని ఉమా ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలని, తాను ప్రశ్నిస్తున్నాను కాబట్టి తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని జగన్ సర్కార్ పై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన అమరావతి లో మీడియాతో మాట్లాడారు. కరోనా విజృంభణ పెరిగిపోతుందని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఎటువంటి కట్టడి వ్యూహాలు లేవని దేవినేని ఉమా పేర్కొన్నారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితికి ఏపీ ప్రభుత్వమే కారణం
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వ విధానాలే కారణమని అసహనం వ్యక్తం చేశారు.కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా మారిందన్నారు .స్మశాన వాటికలలో శవాలు క్యూ కడుతున్నాయని దేవినేని ఉమ మండిపడ్డారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సౌకర్యాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలను వెల్లడించాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

మీ మూడు మాస్కులు ఏమయ్యాయని ప్రశ్న
సామాన్య ప్రజలు కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన దేవినేని ఉమా,కరోనా కారణంగా జర్నలిస్టులు సైతం మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు వ్యాక్సిన్ వేయడానికి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు దేవినేని ఉమా. ఇదే సమయంలో మీ మూడు మాస్కులు ఏమయ్యాయి అంటూ దేవినేని ఉమా నిలదీశారు. పరీక్షల విషయంలో ప్రభుత్వ మొండి వైఖరితో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారని ఉమా అభిప్రాయపడ్డారు.

తాను ప్రశ్నిస్తున్నాను కాబట్టే కక్ష సాధింపు చర్యలు
పరీక్షలపై ఉపాధ్యాయ సంఘాలు నోరు ఎందుకు మెదపడం లేదని దేవినేని ఉమా ప్రశ్నించారు. తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని కక్షపూరితంగా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిఐడి విచారణ పేరుతో తన 18 గంటలపాటు కూర్చోబెట్టారని దేవినేని ఉమ ఆరోపించారు. కావాలని సోషల్ మీడియాలో ఎవరూ పోస్టులు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేసే పనిలో భాగంగానే తనని ఇబ్బంది పెడుతున్నారని దేవినేని ఉమా అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications