విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాడులపై ఏపీలో డాక్టర్ల నిరసనలు- కఠిన చట్టాలు, కరోనా సాయానికి డిమాండ్‌

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా డాక్టర్లపై పెరిగిపోతున్న దాడులపై ఇండియన్ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైద్యులు నిరసనలకు దిగారు. ఇవాళ ఏపీలోని విజయవాడ, గుంటూరుతో పాటు పలుచోట్ల నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలు చేశారు. డాక్టర్లపై జరుగుతున్న దాడులను తక్షణం అరికట్టాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే కరోనాతో చనిపోయిన డాక్టర్ల కుటుంబాలకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రస్తుతం కరోనా వంటి కఠినమైన పరిస్ధితుల్లో పనిచేస్తున్న డాక్టర్లపై దాడులు చేయడ౦ సరికాదని విజయవాడలో జరిగిన నిరసనలో పాల్గొన్న వైద్యులు తెలిపారు. డాక్టర్లను ప్రభుత్వమే రక్షించాలన్నారు. కఠినమైన చట్టాలు చేసి డాక్టర్లు, ఆస్పత్రులకు రక్షణ కల్పించాలన్నారు. రోగులు టెన్షన్‌లో ఉంటారని, కానీ డాక్టర్ల కష్టాన్ని కూడా గుర్తించాలని వారు కోరారు. రోగులను అసాంఘిక శక్తులు ప్రభావితం చేస్తున్నాయని, అయినా డాక్టర్లు ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతీ రెండు వేల మందికి ఓ డాక్టర్‌ ఉన్నారని, సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో డాక్టర్‌ అవుతామని, కానీ డబ్బున్న ప్రతీ వారూ డాక్టర్‌ కాలేరని వారు తెలిపారు.

doctors protests in vijayawada and guntur against attacks, demand for stringent laws

అటు గుంటూరులోని ఐఎంఏ హాల్‌ వద్ద డాక్టర్లు నిరసనకు దిగారు. వైద్య సిబ్బందిపై దాడులకు వ్యతిరకంగా నిరసన ప్రదర్సన చేశారు. కరోనా సమయంలో సమ్మె చేయడం సరికాదని కేవలం నిరసనలు
తెలుపుతున్నామని డాక్టర్లు పేర్కొన్నారు. దాడుల్ని అరికట్టేందుకు పటిష్టమైన చట్టాలు కావాలన్నారు.
అల్లోపతి వైద్యం, వైద్యులపై రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యల్ని డాక్టర్లు ఖండించారు. రాందేవ్‌ బాబాను వెంటనే అరెస్టు చేయాలన్నారు. కరోనాతో చనిపోయిన వైద్యులు, వైద్య సిబ్బందికి తగిన ఆర్ధిక సాయం అందించాలని నిరసనల్లో పాల్గొన్న వారు డిమాండ్‌ చేశారు. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు.

doctors protests in vijayawada and guntur against attacks, demand for stringent laws

Recommended Video

Ys Jagan Govt చేసింది ఇదీ.. చేయబోతోంది ఇదీ | Ap Jobs Calendar 2021 || Oneindia Telugu

ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, ఎన్‌వోసిలు వెంటనే ఇవ్వాలని డాక్టర్‌ నందకిషోర్ డిమాండ్ చేశారు.

English summary
doctors in vijayawada and guntur in andhrapradesh on today staged protests against attacks on them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X