మౌనం వీడిన కొడాలి నాని.. మంత్రి పదవీ లెక్క కాదు, ఎమ్మెల్యేగా ఉండటమే ఇష్టం
ఏపీలో మంత్రి వర్గం కొలువుదీరింది. కొత్త ఆమాత్యులు పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. మరీ పదవీ ఊడిపోయిన వారికి బాధ తప్పదు. ఇక ఫైర్ బ్రాండ్ అయితే చెప్పక్కర్లేదు. అదే కొడాలి నాని గురించి.. కానీ ఆయన మిన్నకుండి పోయారు. అంటే దాదాపుగా సైలంట్ అయిపోయారు. నిన్న కూడా మాజీ మంత్రి దేవినేని ఉమ.. కొడాలి గురించి కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో కొడాలి నాని స్పందించారు.

మంత్రి పదవీ లెక్కకాదు..
తనకు మంత్రి పదవీ అంటే లెక్కేలేదని చెప్పారు. వెంట్రుక ముక్కతో సమానం అని హాట్ కామెంట్స్ చేశారు. గుడివాడ ఎమ్మెల్యేగా ఉండడమే ఇష్టం.. జగన్ వెనుక ఉండి పని చేయడమే ముఖ్యం అని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు దత్త పుత్రుడు, సొంత పుత్రుడు.. రాష్ట్రం శ్రీలంకలా అవుతుందని విషప్రచారం చేస్తున్నారని.. జగన్ లాంటి వ్యక్తులను పొగొట్టుకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని తెలిపారు. గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో కలిసి కొడాలి నాని పాల్గొన్నారు.

తొలిసారి ఇలా..
మంత్రి పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గంలో జరిగిన తొలి కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. గుడివాడ ఎమ్మెల్యేగా ఉండటమే తనకు ఇష్టమని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి దక్కలేదని ఏమీ బాధ లేదన్నారు. ఎమ్మెల్యే పదవీ పోతే బాధపడతానన్నారు. చంద్రబాబు లాంటి వారు పదవీ కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారని విమర్శించారు. దేవుడులాంటి వైఎస్ఆర్‌ను కోల్పోయిన తర్వాత.. రాష్ట్రం రెండు ముక్కలై నాశనం అయ్యిందన్నారు.

పవన్‌పై సురేష్ ఫైర్
చంద్రబాబుకు వయసు అయిపోయితున్ప ఎప్పుడేం మాట్లాడుతున్నారో తెలియడం లేదని ఎంపీ సురేష్ అన్నారు. దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ తెల్ల మొహం వేసుకొని రాష్ట్రంలో తిరుగుతున్నారని విమర్శించారు. తొలి మంత్రివర్గంలో పదవీ దక్కింది. ఇటీవల మాత్రం వరించలేదు. కొడాలి నానికి మరోసారి మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కొడాలి నాని అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. సడెన్‌గా పశువుల కొట్టంలో కనిపించిన ఫొటో తెగ వైరల్‌గా మారింది. మంత్రి పదవీ తనకు అవసరం లేదని, పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications