విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఇల్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ అయితే నాది అదే అన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచన ప్రాయమైన ప్రకటన చెయ్యటం ఆ తర్వాత జీఎన్ రెడ్డి కమిటీ నివేదిక , ఇక తాజాగా జగన్ రాజధానిపై తుది ప్రకటన వాయిదా వెయ్యటం , టీడీపీ నేతలు రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని లెక్కలతో సహా చెప్పటం వంటి పరిణామాలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.

 టీడీపీ ఎమ్మెల్యేలు బఫూన్లా ? అంటూ ఫైర్ అయిన బాబు .. నిరసనగా నల్లచొక్కాతో అసెంబ్లీకి గోరంట్ల టీడీపీ ఎమ్మెల్యేలు బఫూన్లా ? అంటూ ఫైర్ అయిన బాబు .. నిరసనగా నల్లచొక్కాతో అసెంబ్లీకి గోరంట్ల

రాజధాని భూములు విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై మండిపడ్డ గోరంట్ల

రాజధాని భూములు విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై మండిపడ్డ గోరంట్ల

ఇక టీడీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలన్న మంత్రివర్గ ఉప సంఘం చేసిన ప్రపోజల్స్, టీడీపీ నేతలకు రాజధానిలో ఎవరికి ఎంత భూమి ఉంది అన్న వివరాలతో పాటు అన్ని లెక్కలు బయటకు రావటంతో టీడీపీ నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. టీడీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యాఖ్యలపైన , అలాగే మూడు రాజధానుల వ్యవహారంపైన విమర్శించారు. అంతే కాదు టీడీపీ మహిళా నేతల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్న మల్లాది విష్ణు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

 రాజధాని పేరుతో రాక్షస క్రీడకు వైసీపీ తెరతీసిందని ఆగ్రహం

రాజధాని పేరుతో రాక్షస క్రీడకు వైసీపీ తెరతీసిందని ఆగ్రహం

శనివారం ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ రాజధాని పేరుతో రాక్షస క్రీడకు వైసీపీ తెరతీసిందని చెప్పారు. అంతే కాదు బోస్టన్‌ గ్రూపు అవినీతిపై విదేశాల్లో విచారణ జరుగుతోందన్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక జగన్ తాత్కాలికంగా రాజధాని ప్రకటన వాయిదా వేశారన్నారు. కానీ రాజధాని అమరావతి ఉండే ప్రసక్తే లేదని జగన్ తీరు చెప్తోంది అన్నారు. రాజధానిపై జగన్‌ పంజా విసరడం ఖాయమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు.

గత టీడీపీ సర్కార్ అమరావతి కోసం చాలా కష్టపడింది

గత టీడీపీ సర్కార్ అమరావతి కోసం చాలా కష్టపడింది


ప్రస్తుత వైసీపీ సర్కార్ బాధ్యత లేని ప్రభుత్వమని గోరంట్ల తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్నిర్మించిందని ,టీడీపీ హాయంలో ఎన్నో నిర్మాణాలు కొనసాగాయని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. అప్పులు తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేశామని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. అప్పుడు మమ్మల్ని విమర్శించిన వైసీపీ ఇప్పుడు ఎందుకు అప్పులు తీసుకొస్తోందని బుచ్చయ్య నిలదీశారు .

 జగన్ తాత గుమస్తాగా ఉన్నప్పుడే నేను 60 ఎకరాల భూస్వామిని అన్న గోరంట్ల

జగన్ తాత గుమస్తాగా ఉన్నప్పుడే నేను 60 ఎకరాల భూస్వామిని అన్న గోరంట్ల

ఇప్పుడు రాజధానిపై జగన్ వేసే కమిటీలు అన్నీ తాను అనుకున్నట్టు అనుకూల నివేదికల కోసమే తప్ప వేరే కాదని బుచ్చయ్య పేర్కొన్నారు . తాను రాజమండ్రిలో వారసత్వంగా వచ్చిన భూమిలో 7 ఎకరాలు అమ్మి 2015 ఫిబ్రవరిలో అమరావతిలో 2.96 ఎకరాల భూమి కొనుగోలు చేశానని బుచ్చయ్యచౌదరి తెలిపారు. అలా కొనుగోలు చెయ్యటం తప్పేమీ కాదు కదా అని ప్రశ్నించారు . తాడేపల్లిలో జగన్‌ భవనం ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అయితే తనది కూడా అదేనని చెప్పారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్‌ తాత గుమస్తాగా ఉన్నప్పుడే నేను 60 ఎకరాల భూస్వామినని చెప్పుకొచ్చారు.

English summary
Buchaiah chowdary said he had sold 7 acres of land he inherited in Rajahmundry and bought 2.96 acres in Amaravati in February 2015. Asked if it is not worth buying. Buchaiah Chowdary said that the jagan's home at Tadepalli was the same as the Insider Trading then my land also treat as insider trading.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X