విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Vijayawada Airport : అంతర్జాతీయ సర్వీసులు పునఃప్రారంభం-అందుబాటులోకి కొత్త రన్ వే

|
Google Oneindia TeluguNews

విజయవాడ విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా కొంతకాలం, కొత్త రన్ వే నిర్మాణం కారణంగా మరికొంతకాలం ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు పూర్తి స్దాయిలో సర్వీసులు ప్రారంభమయ్యాయి. కొత్తగా నిర్మించిన రన్ వే పై ఇకపై బోయింగ్ విమానాలు వాలబోతున్నాయి.

విజయవాడ విమానాశ్రయంలో కొత్త రన్ వే పనులు పూర్తయ్యాయి. తాజాగా ఇక్కడ 3360 మీటర్ల మేర కొత్త రన్ వే నిర్మించారు. గతంలో 2286 మీటర్ల మేర రన్ వే ఉండగా.. ఇప్పుడు దాన్ని పొడిగించి మరో 1074 మీటర్ల మేర రన్ వేను నిర్మించారు. దీంతో అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలకు ఇది అనువుగా మారింది. బోయింగ్ వంటి భారీ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేందుకు వీలు కలిగింది.

international services resume in vijayawada airport with new run way

Recommended Video

Vijayawada Division Achieves Highest Goods Trains Interchange

ఇప్పటివరకూ అంతర్జాతీయ స్ధాయి రన్ వే లేకపోవడంతో విదేశీ సర్వీసుల రాకపోకలకు ఇబ్బందులు ఉండేవి. రన్ వే విస్తరణతో పెద్ద బోయింగ్ విమానాలు 777స 747, ఎయిర్ బస్ 30 వంటి సర్వీసులు రాకపోకలు సాగించేందుకు వీలు కలిగింది.
ఇప్పటివరకూ సీ-కేటగిరీ విమానాల రాకపోకలు మాత్రమే సాగిస్తుండగా..ఇప్పుడు మిగతా కేటగిరీ విమానాలు కూడా రానున్నాయి. ఇవాళ్టి నుంచి దుబాయ్, సింగపూర్ కు నేరుగా సర్వీసులు ప్రారంభమయ్యాయి. కొత్త రన్ వేపై ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ల్యాండ్ అయిందని ఎయిర్ పోర్టు డైరెక్టర్ మధుసూధనరావు తెలిపారు.

English summary
international flight services has been resumed at vijayawada international airport from today after new runway available.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X