Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ నుంచి బరిలో మన్మథుడు: ప్లేస్ పక్కా - ఇదే జగన్ లెక్క..!!

విజయవాడ: విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమీకరణాలు మారబోతోన్నాయ?, కమ్మ సామాజిక వర్గానికి పెట్టని కోటగా చెప్పుకొనే ఈ లోక్‌సభలో జెండా పాతడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టిందా?.. రెండు దఫాలుగా ఓడిపోయిన ఈ స్థానంలో ఎలాగైనా సరే పాగా వేయడానికి ఎత్తులు వేస్తోందా?- అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇందులో భాగంగా- టాలీవుడ్ అందగాడు అక్కినేని నాగార్జునను బరిలోకి దించబోతోందనే ప్రచారం ఊపందుకుంది.

కమ్మ సామాజిక వర్గానికి కంచుకోట..

కమ్మ సామాజిక వర్గానికి కంచుకోట..

విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గానికి కంచుకోట. చెన్నుపాటి విద్య మొదలుకుని కేశినేని నాని వరకూ ఈ స్థానం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యాన్ని వహించిన వారందరూ ఆ కమ్యూనిటీకి చెందినవారే. ప్రతి పార్టీ కూడా ఇక్కడ వారినే అభ్యర్థిగా బరిలోకి దింపడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తోన్నాయి. కాంగ్రెస్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన లగడపాటి రాజగోపాల్ ఆ సామాజిక వర్గ నాయకుడే.

కొరుకుడు పడని విజయవాడ..

కొరుకుడు పడని విజయవాడ..

వైఎస్ఆర్సీపీకి విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం కొరుకుడు పడట్లేదు. 2014, 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే బరిలోకి దింపినప్పటికీ- గెలుపు మాత్రం సాధ్యపడలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేశినేని నానిని ఓడించలేకపోయింది వైఎస్ఆర్సీపీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలోనూ విజయవాడ లోక్‌సభ స్థానాన్ని టీడీపీ గెలుచుకోగలిగింది. 2014లో కోనేరు ప్రసాద్, 2019లో పొట్లూరి వరప్రసాద్‌ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అదే వ్యూహంతో..

అదే వ్యూహంతో..

2024లో ఎదుర్కొనబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ అదే వ్యూహాన్ని అనుసరించడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థిగా నటుడు అక్కినేని నాగార్జునను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అక్కినేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడే కావడంతో ఆయన అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారవుతుందని చెబుతున్నారు. తెలుగుదేశానికి అండగా ఉంటూ వస్తోన్న కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి అందుబాటులో ఉన్న ఛరిష్మా గల వ్యక్తి నాగార్జున ఒక్కడేనని వైసీపీ భావిస్తోంది.

నాగ్‌తో సత్సంబంధాలు

నాగ్‌తో సత్సంబంధాలు

అక్కినేని నాగార్జునతో వైఎస్ జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచీ నాగార్జున- ఆ కుటుంబాన్ని అభిమానిస్తోన్నారు. వైఎస్ కుటుంబంతో ఉన్న స్నేహాన్ని పోగొట్టుకునేలా ఎక్కడా వ్యవహరించలేదు. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారంలోనూ ఆయన వైఎస్ జగన్ నిర్ణయాన్ని సమర్థించారు. బంగర్రాజు మూవీ ప్రెస్‌మీట్‌లో బహిరంగంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. టికెట్ల రేట్ల వల్ల తన సినిమాపై ఎలాంటి ప్రభావం పడదని వ్యాఖ్యానించారు.

టీడీపీలో లుకలుకలు..

టీడీపీలో లుకలుకలు..

విజయవాడ టీడీపీలో ఇప్పటికే లుకలుకలు తలెత్తాయి. ప్రస్తుత ఎంపీ కేశినేని.. టీడీపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తోన్నారని చెబుతున్నారు. తనకు బదులుగా సోదరుడు చిన్నిని పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తోందనే అభిప్రాయం నానిలో బలంగా ఉంది. అందుకే ఆయన టీడీపీకి దూరంగా ఉంటోన్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ పరిస్థితుల మధ్య- కేశినేని నాని టీడీపీని వీడినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు విస్తృతంగా వినిపించాయి. దీన్ని సొమ్ము చేసుకునేలా వైసీపీ వ్యూహాత్మకంగా అక్కినేని నాగార్జునను బరిలో దింపుతుందని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+