జగన్ ప్రభుత్వానికి కరకట్ట అక్రమ నిర్మాణాల విషయంలో కాస్త ఊరట ..గోకరాజు గంగరాజుకు షాక్
బీజేపీ నేత గోకరాజు గంగరాజు కు హైకోర్టు ధర్మాసనం షాక్ ఇచ్చింది. ఒక గోకరాజు గంగరాజు కే కాదు, కృష్ణానది కరకట్ట మీదుగా అక్రమ నిర్మాణాలు చేసిన ప్రతి ఒక్కరికి హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు షాకింగ్ అనే అనిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని సీఆర్డీఏ పంపించిన నోటీసులను నిలిపివేయాలని, కూల్చివేతలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని గోకరాజు గంగరాజు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఇక వీటిపై విచారించిన కోర్టు పలు ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించడం తో పాటుగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.

కృష్ణా నది కరకట్ట నిర్మాణాల నోటీసులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటీషన్ వేసిన గోకరాజు గంగరాజు
ఏపీ సీఎం జగన్ అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో కృష్ణానది కరకట్ట పై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది . ఉండవల్లిలో కరకట్ట వెంబడి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే కరకట్టపై నిర్మించిన గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కు సిఆర్‌డిఎ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక తన గెస్ట్ హౌస్ కు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపి గోకరాజు గంగరాజు కృష్ణానది భూమిని తాము ఆక్రమించలేదని తమ భూమినే కృష్ణా నది ఆక్రమించిందని షాకింగ్ కామెంట్ చేశారు. అయితే ప్రభుత్వ నోటీసులపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి నోటీసుల అమలు నిలిపివెయ్యాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయతే కోర్టు మధ్యంతర ఆదేశాలను నిరాకరించింది. దీంతో ఏపీ సర్కార్ కు ఊరట లభిస్తే కరకట్ట అక్రమ నిర్మాణ యజమానులకు షాక్ తగిలింది.

అన్ని అనుమతులు ఉన్నాయని కూల్చివేత నోటీసులు ఆపాలని కోరిన పిటీషనర్
సీఆర్డీఏ ఇచ్చిన నోటీసులపై గోకరాజు గంగరాజు కోర్టును ఆశ్రయించారు. తన భవనం నిర్మించిన తర్వాతే నదికి వంద మీటర్ల లోపల ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదన్న జీవో వచ్చిందని ,తాము ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని ఆయన తన పిటీషన్ లో కోర్టుకు విన్నమించారు . చట్ట ప్రకారమే నడుచుకున్నామని గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఉడా, ఇరిగేషన్ అనుమతులు ఉన్నాయన్నారు. బిపిఎస్ వచ్చిన తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేశామని పేర్కొన్నారు . దీంతో గతంలో ఇరిగేషన్ అధికారులు 30 అడుగులు మాత్రం వదిలి భవనం నిర్మించుకోమని పర్మిషన్ ఇచ్చినట్లుగా గోకరాజు తెలిపారు.

నోటీసుల అమలు నిలిపివేతపై హైకోర్టు నిర్ణయం .. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని నిరాకరణ
ఈ అక్రమ కట్టడాలపై వారం రోజుల్లోగా జవాబు చెప్పాలనీ, లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఆర్డీఏ అధికారులు చెప్పినా వారికి సమాధానం ఇవ్వకుండా కోర్టును ఆశ్రయించారు. ఇక గోకరాజు గంగరాజు పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఇరువైపుల వాదనలు విన్నారు. అప్పుడెప్పుడో నిర్మాణాలు చేస్తే గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని, 2017 లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులను ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది అంతేకాదు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ విచారణను ఈనెల 29కి వాయిదా వేస్తూ ప్రకటన చేశారు. నిర్మాణాల కూల్చివేత కు సంబంధించి సీఆర్డీఏ అధికారులు జారీ చేసిన నోటీసులు అమలును నిలిపివేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
-
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి











Click it and Unblock the Notifications