జనసేన ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ ... వైసీపీ కుట్ర అంటున్న జనసైన్యం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. భారీ సంఖ్య లో జనసేన పార్టీకి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ చేయడంతో జన సైన్యం ఆగ్రహంతో మండిపడుతున్నారు. ట్విట్టర్ రూల్స్ ను అతిక్రమించారనే కారణంతో 300 ట్విట్టర్ ఖాతాలను సస్పెండ్ చేయడంతో ఇది వైసీపీ కుట్ర అని జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జనసేన కు మద్దతుగా ప్రచారం చేసే సోషల్ మీడియా ఖాతాలు సస్పెండ్

జనసేన కు మద్దతుగా ప్రచారం చేసే సోషల్ మీడియా ఖాతాలు సస్పెండ్

ఏపీలో జనసేన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాలనలో విఫలమైందని నిప్పులు చెరుగుతోంది. అంతేకాకుండా సేవ్ నల్లమల పేరుతో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలో జనసేన కు మద్దతుగా పనిచేసే అభిమానులు ట్విట్టర్ లో పెద్ద ఎత్తున సేవ్ నల్లమల క్యాంపెయిన్ ను , అలాగే జగన్ ఫెయిల్డ్ సీఎం అంటూ మరో క్యాంపెయిన్ ను నిర్వహిస్తోంది. అయితే ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న ట్విట్టర్ అకౌంట్లు సస్పెండ్ చేస్తూ ట్విట్టర్ షాక్ ఇచ్చింది.

 ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ చెయ్యటం వైసీపీ కుట్ర అంటున్న జనసేన

ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్ చెయ్యటం వైసీపీ కుట్ర అంటున్న జనసేన

మొదటి నుండి జనసేన పార్టీకి మీడియాలో ప్రచారం తక్కువగా ఉన్న నేపథ్యంలో, సోషల్ మీడియా ద్వారా జనసైనికులు అధినేత పవన్ కళ్యాణ్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలోని అకౌంట్ లను సైతం సస్పెండ్ చేయడంతో జనసేన పార్టీ శ్రేణులు ఇదంతా వైసీపీ కుట్ర అని ఆరోపిస్తున్నారు. జగన్ తనకు నచ్చని న్యూస్ చానళ్లను, సోషల్ మీడియా ఖాతాలను క్లోజ్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

300 ఖాతాలను సస్పెండ్ చేయిస్తే 3000 ఖాతాలను సృష్టిస్తామని సవాల్

300 ఖాతాలను సస్పెండ్ చేయిస్తే 3000 ఖాతాలను సృష్టిస్తామని సవాల్

300 ఖాతాలను సస్పెండ్ చేయిస్తే 3000 ఖాతాలను సృష్టిస్తా మంటూ సవాల్ విసురుతున్నారు. కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనసేన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు.సేమ్ నల్లమల క్యాంపెయిన్ ఇతర పార్టీలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీల అకౌంట్లు యధావిధిగా కొనసాగుతున్నాయని, కేవలం జగన్ ఫెయిల్యూర్ సీఎం క్యాంపెయిన్ వల్లే తమ అకౌంట్లను సస్పెండ్ చేయించారని చెప్తున్నారు జనసైనికులు.

ప్రధాన ప్రచార మాధ్యమం సోషల్ మీడియాలో జనసేన కు షాక్

ప్రధాన ప్రచార మాధ్యమం సోషల్ మీడియాలో జనసేన కు షాక్

వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా, జనసేన కార్యకర్తలు ముందుకు వెళ్తూనే ఉంటారని పేర్కొన్నారు.ఏది ఏమైనా గత ఎన్నికల్లో ఒకే ఒక స్థానానికి పరిమితమైన జనసేన పార్టీ, తిరిగి ఏపీలో పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అధికార పార్టీ పని తీరుపై విరుచుకుపడుతుంది.ఇక జనసేన పార్టీ కార్యక్రమాల ప్రచారానికి ప్రధాన వేదికగా పనిచేస్తున్న జనసేనకు సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేయడం పెద్ద షాక్ అని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+