పవన్ కళ్యాణ్ కు అస్వస్థత: తిరగబెట్టిన సమస్య!
Recommended Video
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఎంతో కాలంగా వెన్నుముక నొప్పితో బాధపడుతున్నారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో గాయం కారణంగా మొదలైన ఈ సమస్య తిరిగి ఇప్పుడు మొదలైంది. వైద్యుల వద్ద ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఈ మధ్య కాలంలో ఎక్కవ అయిదంటూ పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేసారు. తిరిగి ఇప్పుడు గాయం నొప్పి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

ధన్యవాదాలు చెబుతూ
ఈ సమస్య కారణంగా విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకాలేకపోతున్నానని అన్నారు. మీడియా స్వేచ్చ కోసం చేస్తున్న ఈ పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. అయితే తనకు తలెత్తిన ఈ సమస్యకు వైద్యం తీసుకుంటున్నందున మూడు రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని పేర్కొన్నారు. తాను రాలేకపోయినా..తన మీద గౌరవంతో ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు చెబుతూనే..తన స్థానంలో పార్టీ నేతలు హాజరవుతారని స్పష్టం చేసారు.

సైరా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్
గత ఆదివారం అన్నయ్య సైరా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఆ తరువాత వాటర్ మేన్ రాజేంద్ర సింగ్ పవన్ కళ్యాణ్ తో సమావేవమయ్యారు. ఇవి మినహా..పార్టీ కార్యక్రమాలు..సమీక్షలకు పవన్ దూరంగా ఉంటున్నారు. గత వారం విజయవాడలో జగన్ వంద రోజుల పాలన గురించి నివేదిక విదుడల చేసిన తరువాత పవన్ పార్టీ కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు.

జగన్ పాలన గురించి
పవన్ తన నివేదికలో జగన్ పాలన గురించి చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ నేతలు తీవ్రంగానే స్పందించారు. వరుసగా మంత్రులుగా... పార్టీ నేతలు పవన్ పైన తీవ్రంగా విమర్శలు చేసారు. చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నారంటూ ఆరోపించారు. వీటి పైన పవన్ తో సహా జనసేన నేతలు ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు.

రౌండ్ టేబుల్ కార్యక్రమానికి
ఇక, ఇప్పుడు మీడియా స్వేఛ్చ పేరుతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కార్యక్రమానికి రావాలని నిర్వహాకులు పవన్ ను ఆహ్వానించారు. ఇప్పుడు పవన్ ఓపెన్ ప్రకటన ద్వారా తన అనారోగ్య సమస్యను వెల్లడించారు. వైద్యులు చికిత్సలో భాగంగా ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. కానీ, సాంప్రదాయ వైద్యం పైన నమ్మకం ఉన్న తాను సర్జరీ వైపు మొగ్గు చూపటం లేదని పవన్ స్పష్టం చేసారు.

పవన్‌కు ఇదే సమస్యతో
ఎన్నికల సమయంలో పవన్ ఇదే సమస్యతో ఇబ్బంది పడ్డారు. వరుసగా జిల్లాల్లో సభలు సమావేశాలు నిర్వహించిన సమయంలో ఆయన వెన్నుముక సమస్యతో పాటుగా డీహైడ్రేషన్ కు గురయ్యారు. దీంతో.. ఆయనకు పార్టీ నేతలు విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పూర్తిగా కోలుకోకుండానే ఆయన విశాఖ సభలో పాల్గొనేందుకు వెళ్లారు.

వెన్నుముక సమస్య
ఇప్పుడు వెన్నుముక సమస్య కారణంగా నొప్పితో పవన్ ఎక్కువగా బాధ పడుతున్నారని..అందుకే ఆయన అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే కోలుకొని ఆయన తిరిగి పార్టీ కార్యక్రమాలకు హాజరవుతారని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications