ఏపీ రాజధానిపై కేశినేని నానీ ప్రశ్న ... మరోసారి రాజధానిపై కుండ బద్దలు కొట్టిన కేంద్రం

ఏపీ రాజధానిపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నా మొన్నాటి దాకా రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది అని భావిస్తే ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో రాజధాని విషయం రాష్ట్రాల పరిదిలోనిది అని తేల్చి చెప్పింది కేంద్రం . అప్పుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు 2015లో అప్పటి ప్రభుత్వం అమరావతిని ఏర్పాటు చేస్తే దాన్ని కేంద్రం నోటిఫై చేసిందని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. మూడు రాజధానుల అంశంపై కూడా మీడియా ద్వారా తెలుసుకున్నామని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఇక తాజాగా కేశినేని నానీ అడిగిన ప్రశ్నకు మరోమారు కేంద్రం ఏపీ రాజధాని అంశంపై పార్లమెంట్‌లో స్పష్టతనిచ్చింది.

రాజధానిపై నిర్ణయం కేంద్రం పరిధిలోనిది కాదని తేల్చి చెప్పింది. ఇక రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదేనని పేర్కొంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని నానీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరోమారు రాజధాని అంశంపై కేంద్రం చేతులెత్తేసింది . లిఖితపూర్వక సమాధానం ఇచ్చి మరీ రాజధాని ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పింది.

kesineni Nani question on AP capital .. center gave clarity once again

ఇక అంతేకాదు ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కూడా స్పష‌్టం చేసింది. ఇక ఈ సమాధానంతో రాజధాని రైతుల ఆశలపై నెలలు చల్లినట్టు అయ్యింది. మరోవైపు ఈ సమాధానం ఏపీలోని బీజేపీ వర్గాలకు, అలాగే తాజాగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన వర్గాలకు అసలు రుచించటం లేదు . మరోసారి పార్లమెంటులో కేంద్రం రాజధానిపై స్పష్టత ఇవ్వటంతో కేంద్రం ఎలాంటి జోక్యం రాజధాని విషయంలో చేసుకోదని అర్ధం అవుతుంది . అంతకు ముందు కూడా ఇదే విషయాన్ని కేంద్రం స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+