విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడివాడ‌లో వివాదాస్ప‌దంగా కొడాలి నాని ఫొటో!

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి కొడాలి నాని సొంత నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌లో నూత‌నంగా పుర‌పాల‌క శాఖ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేశారు. నాని మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఈ కార్యాల‌యం ఏర్పాటైంది. ఆ స‌మ‌యంలో మంత్రి నిలువెత్తు ఫొటోను కార్యాల‌య ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఉంచారు. త‌ర్వాత ఆయ‌న మంత్రి ప‌ద‌విని కోల్పోయారు. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ ఆయ‌న ఫొటోను అక్క‌డే ఉంచారు.

నాని చిత్రాన్ని తొలగించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి క‌ఠారి ఈశ్వ‌ర్ కుమార్ దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. పుర‌పాల‌క శాఖ క‌మిష‌న‌ర్ సంప‌త్‌కుమార్ తో ఆయ‌న ఫోన్ లో మాట్లాడి నాని చిత్రాన్ని తొల‌గించాల‌ని కోరారు.

kodali nani Controversial image in gudivada muncipal office

ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి సంబంధించిన చిత్రాల‌నే ఉంచాల‌న్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రాల‌ను పెట్ట‌డం ఏమిట‌ని క‌ఠాని ప్ర‌శ్నించారు. అధికారులు స్పందించి వారం రోజుల వ్య‌వ‌ధిలో ఆ చిత్రాన్ని తొలగించాలని లేదంటే ధర్నాకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న క‌మిష‌న‌ర్‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఆ చిత్రాన్ని తీసేసి దాని స్థానంలో రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బి.ఆర్‌.అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని క‌మిష‌న‌ర్‌కు సూచించిన‌ట్లు స‌మాచారం.

English summary
Former minister Kodali Nani has set up a new municipal department office in his own constituency Gudivada.This office was established during Nani's tenure as minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X