Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rahul murder case:రహస్య ప్రాంతంలో విజయ్‌కుమార్ విచారణ.. మహిళకు నగదుపై ఆరా..

బెజవాడ బిజినెస్ మ్యాన్ రాహుల్ హత్య కేసు విచారణ కొలిక్కి వచ్చినట్టే అనిపిస్తోంది. ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్‌ను పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. రాహుల్‌ హత్యకు గల కారణాలపై ప్రశ్నల వర్షం కొనసాగుతోంది. హత్య జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారనే అంశంపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి. రాహుల్‌ హత్యలో ముగ్గురు మహిళలు, కోగంటి సత్యం పాత్రపై కూపీ కూడా లాగుతున్నారు.

ఎవరెవరు పార్ట్‌నర్స్..

ఎవరెవరు పార్ట్‌నర్స్..

కంపెనీలో ఎవరెవరు పార్ట్‌నర్స్‌గా ఉన్నారు, ఎంత పెట్టుబడులు పెట్టారనే అంశంపై విజయ్‌కుమార్‌ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. విజయ్‌కుమార్‌ మాత్రం... కంపెనీలో తానే మేజర్‌ పెట్టుబడి పెట్టానని చెబుతున్నారు. తనకు తెలియకుండా రాహుల్‌ చాలామందిని చేర్చుకున్నాడని చెప్పినట్టుగా తెలుస్తోంది. హత్యలో కోగంటి సత్యం పాత్ర ఏంటి, తన మనుషులు ఎవరైనా హత్యలో ప్రమేయం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

18వ తేదీన హత్య

18వ తేదీన హత్య

ఈ నెల 18న విజయవాడలో రాహుల్‌ దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. రాహుల్‌ హత్యలో మొత్తం ఐదుగురి పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో పాత్రధారులుగా అనుమానిస్తున్న మరో ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్‌ను చేర్చిన పోలీసులు.. ఏ2గా ఆయన భార్య కోరాడ పద్మజను చేర్చారు. ఏ3గా గాయత్రి, ఏ4గా కోగంటి సత్యం పేర్లను చేర్చారు పోలీసులు. హత్య సమయంలో వీళ్లంతా ఎక్కడున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ ముగ్గురిలో ఓ మహిళ మృతుడు రాహుల్‌కు గతంలో 6 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అంత డబ్బు ఎందుకు ఇచ్చారు? ఏ పని కోసం ఇచ్చారనే దానిపై పోలీసులు వివరాలు రాబడుతున్నారు. రాహుల్ మర్డర్‌ కేసులో ప్రధాన నిందితుడైన కోరాడ విజయ్‌కుమార్ వాంగ్మూలం కీలకంగా మారింది.

బాబుపై ప్రశ్నల వర్షం..

బాబుపై ప్రశ్నల వర్షం..

విజయ్‌కుమార్‌తోపాటు అతడి డ్రైవర్‌ బాబును పోలీసులు విచారించారు. కోగంటి సత్యం పాత్ర గురించి విజయ్‌కుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. విజయ్‌కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా రాహుల్‌ హత్య కేసులో కోగంటి సత్యం హస్తముందో, లేదో పోలీసులు నిర్ధారించనున్నారు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్‌కు చెందిన జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకే కొట్టేయాలని నిందితులు స్కెచ్ వేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఇదే అంశంలో ఏడాది కాలంగా కోరాడ విజయ్.. రాహుల్ మధ్య వివాదం నడుస్తోందని తెలుస్తోంది. కంపెనీలో వాటా విషయంలో కోగంటి సత్యం ఎంట్రీతో మొత్తం సీన్ మారిపోయింది. అప్పటినుంచి రాహుల్‌ హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ నగరాల్లో గాలిస్తున్నారు. ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై ఆరా తీస్తున్నారు.

రాఘవరావు కంప్లైంట్

రాఘవరావు కంప్లైంట్


రాహుల్ తండ్రి రాఘవరావు ఫిర్యాదు మేరకు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్, ఏ2గా కోగంటి సత్యం పేర్లు చేర్చారు. ముగ్గురు మహిళల ప్రేమేయం కూడా రాహుల్ హత్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హత్యతో పాత్రధారులుగా భావిస్తున్న పద్మజ అనే పేరుతో ఉన్న ఇద్దరు మహిళల పేర్లను కూడా ఏ3, ఏ4గా చేర్చారు. కోగంటి సత్యం ద్వారా ఫ్యాక్టరీ కొనుగోలుకు చర్చలు జరిగాయని... తన వాటా డబ్బుల కోసం కోరాడ విజయ్‌కుమార్ అనేకసార్లు ఒత్తిడి తెచ్చారని రాహుల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరాడ కుటుంబ సభ్యులకు హత్యతో సంబంధముందని రాహుల్ తండ్రి రాఘవరావు ఆరోపిస్తున్నారు. అయితే ఇవాళ కోరాడ విజయ్‌కుమార్‌ పోలీసులకు లొంగిపోయాడు.

సత్యం పాత్ర

సత్యం పాత్ర

రాహుల్ హత్య కేసులో కోరాడ విజయ్‌కుమార్ వాంగ్మూలం కీలకంగా మారింది. ప్రస్తుతం విజయ్‌కుమార్‌తో పాటు అతడి డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. విజయ్‌కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా హత్య కేసులో కోగంటి సత్యం పాత్రను పోలీసులు నిర్ధారించనున్నారు. కోగంటి సత్యం గురించి విజయ్‌కుమార్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో ఏ4, ఏ5గా ఉన్న తళ్లీ కూతుళ్లు.. గాయత్రీ, పద్మజల గురించి కూడా ప్రశ్నించినట్లు సమాచారం అందుతోంది. గాయత్రీ, పద్మజ పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. మాచవరం పీఎస్‌లో కోరాడ విజయ్‌కుమార్‌ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నారు.

రాం ప్రసాద్ హత్యతో లింక్..

రాం ప్రసాద్ హత్యతో లింక్..


గతంలో హైదరాబాద్‌లో జరిగిన వ్యాపారి రాంప్రసాద్‌ హత్య కేసులో కీలక నిందితుడైన శ్యామ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇవాళ కోరాడ విజయ్‌ కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ నగరాల్లో గాలిస్తున్నారు. ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై ఆరా తీస్తున్నారు.

తక్కువ ధరకు కంపెనీ

తక్కువ ధరకు కంపెనీ

కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్‌కు చెందిన జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకే కొట్టేయాలని నిందితులు స్కెచ్ వేసినట్లు డ్రైవర్ బాబు పోలీసులకు తెలిపాడు. ఇదే అంశంలో గత ఏడాది కాలంగా కోరాడ విజయ్.. రాహుల్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. రూ. 15 కోట్లు విలువ చేసే జిక్సిన్ కంపెనీ30 శాతం వాటాను వెనక్కి ఇవ్వాలన్ని కోరాడు విజయ్. ఇందుకోసం రాహుల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు. డబ్బుల కోసం రాహుల్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. మరోవైపు విజయ్ వాటాను కొనేందుకు కోగంటి సత్యం ప్రయత్నించాడు. అతనికి కంపెనీలో షేర్ ఇచ్చేందుకు రాహుల్ నిరాకరించాడు. దాంతో రాహుల్‌ను హత్య చేయాలని వారు నిర్ణయించుకున్నారు. మూడు నెలల క్రితమే రాహుల్ హత్యకు భారీ స్కెచ్ వేశారు. రాహుల్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది కోగంటి టీమ్‌గా పోలీసులు భావిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+