లగడపాటి సంచలన నిర్ణయం : ఆక్టోపస్ పై తెలంగాణ ఎఫెక్ట్..!
ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ పై తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్ పడింది. తెలంగాణ ఎన్నికల సమయంలో పో లింగ్ కు ముందే ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని చెప్పారు. ఫలితాలు తారు మారు కావటంతో..ఆయన కొద్ది రోజులు మీడియా కు దూరంగా ఉన్నారు. తాజాగా, ఓ కీలక నిర్ణయం తీసుకున్న ట్లు గా ప్రకటించారు.
తెలంగాణ ఎఫెక్ట్..
ప్రతీ ఎన్నికల పైనా తన సర్వే ఫలితాలతో ముందకొచ్చే లగడపాటి పై తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇంకా పోలేదు. తెలంగాణ ఎన్నికలపై పోలింగ్ కు ముందుగానే లగడపాటి ఆసక్తి రేపారు. తొలుత తెలంగాణ ఎన్నికల్లో ఎని మిది మంది స్వతంత్ర అభ్యర్ధులు గెలుసస్తున్నారంటూ వరుసగా పేర్లు ప్రకటించారు. ఆ తరువాత చెప్పను అంటూనే పరోక్షంగా కాంగ్రెస్ కూటమి గెలవబోతుందని జోస్యం చెప్పారు. ఇక, ఎన్నికల ముందు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఖాయమని కుండబద్దలు కొట్టారు. ఒకే సారి 105 మంది అభ్యర్ధులను ప్రకటించటం..సిట్టింగ్ ల పై వ్యతిరేకత ఉందని తాను చెప్పినా పరిగణలోకి తీసుకోలేదని లగడపాటి చెప్పుకొచ్చారు. అయితే, లగడపాటి సర్వే పై ముఖ్యమం త్రి కేసీఆర్..తెలంగాణ నేతలు ఫైర్ అయ్యారు. ఇక, ఫలితాల్లో లగడపాటి జోస్యానికి పూర్తి భిన్నంగా ఉండటంతో అప్ప టి దాకా ఒక ఇమేజ్ ఉన్న లగడపాటి పై అనేక విమర్శలు వచ్చాయి.

సంచలననిర్ణయం..
తెలంగాణ ఎన్నికల ఫలితాలకు సంబంధించి తన సర్వే బెడిసికొట్టడంతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచ లన నిర్ణయం తీసుకున్నారు. తాను సర్వేలు చేయడం మాననని స్పష్టం చేసిన ఆయన.. కాకపోతే ఇకపై వెల్లడించే సర్వే ఫలితాలు పోలింగ్ తర్వాత మాత్రమే వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా కూడా సర్వే చేస్తానని.. కానీ ఫలితాలను ఎన్నికలు ముగిసిన తర్వాతే వెల్లడిస్తానని లగడపాటి ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల సర్వేలో ఎవరి ప్రభావం తన మీద లేదని పదేపదే చెప్పిన లగడపాటి.. తాజాగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసారు. దీంతో.. మరోసారి ఏపిలోనూ సర్వేల పేరుతో లగడపాటి తిరిగి హడావుడి చేయటానికి సిద్దం అవుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో లగడపాటి చేసిన తాజా ప్రకటన ఇప్పుడు సంచలనం గా మారింది.












Click it and Unblock the Notifications